సౌత్ లో అవకాశాలు దూరమైనా బాలీవుడ్ లో పాగా వేసిన కృతి కర్బందా

సౌత్ లో స్టార్ హీరోయిన్లుగా సక్సెస్ అయిన అందాల భామలు తరువాత బాలీవుడ్ వైపు అడుగులు వేస్తారు.అలా వెళ్లిన వారిలో కొంత మంది మాత్రమే సక్సెస్ అయ్యారు.

 Kriti Kharbanda Gets Bollywood Movie Offers, Tollywood, Telugu Cinema, South Her-TeluguStop.com

గతంలో అతిలోక సుందరి శ్రీదేవి సౌత్ నుంచి బాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అయ్యింది.అలాగే జయప్రద కూడా బాలీవుడ్ లో జెండా పాతింది.

తరువాత ఎక్కువ మంది సౌత్ హీరోయిన్లు నార్త్ ఇండియా నుంచి దిగుమతి అవుతూ వచ్చారు.వాళ్ళంతా ఇక్కడ సక్సెస్ వచ్చాక బాలీవుడ్ వైపు అడుగులు వేశారు.

ఇలియానా అలా వెళ్ళిన అక్కడ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.తాప్సి అక్కడికి వెళ్లి ఫిమేల్ సెంట్రిక్ కథలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది.

ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ కథలకి తాప్సి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.ఇక వీరి దారిలోనే రకుల్ ప్రీత్ సింగ్, ఇప్పుడు పూజా హెగ్డే, రాష్మిక మందన కూడా వెళ్తున్నారు.

అయితే సౌత్ లో ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ లేక నార్త్ లో సక్సెస్ అయిన హీరోయిన్లు ఉన్నారు.

వారిలో కృతి కర్బందా ఒకరు.

ఈ భామ బోణి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.తరువాత తీన్ మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించే అవకాశం సొంతం చేసుకుంది.

ఈ రెండు సినిమాలు ఎవరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.ఆ తరువాత మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త లాంటి సినిమాలలో నటించిన హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేదు.

తరువాత బ్రూస్ లీ సినిమాలో రామ్ చరణ్ కి అక్కగా నటించిన సక్సెస్ రాలేదు.అయితే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడుకి అవకాశాలు భాగానే వచ్చాయి.

ఇటీవలే హిందీలో కూడా పాగల్ పంతి, హౌస్ ఫుల్-4 సినిమాలతో హిట్ అందుకుంది.తెలుగులో కనీసం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడకపోయినా బాలీవుడ్ లో ప్రస్తుతం మూడు సినిమాలు అమ్మడు చేతిలో ఉన్నాయంటే ఇప్పుడు కృతికి అక్కడ ఎలాంటి గుర్తింపు ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube