ఆ సినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకుంటున్న కృతి శెట్టి

ఉప్పెన సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి కృతి శెట్టి.ఈ బ్యూటీ మొదటి సినిమా పూర్తి కాకుండానే ఏకంగా మూడు సినిమాలలో హీరోయిన్ గా అవకాశం సొంతం చేసుకుంది.

 Krithi Shetty Telangana Slang Role In New Movie-TeluguStop.com

అందులో నానితో శ్యామ్ సింగరాయ్, సుదీర్ బాబుతో పాటు హీరో రామ్ తో కూడా నటించే అవకాశం సొంతం చేసుకుంది.ఉప్పెన సక్సెస్ మూడ్ లో ఉన్న ఈ అమ్మడు సినిమా ప్రమోషనల్ టూర్ లో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుదీర్ బాబు ప్రేమకథా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

 Krithi Shetty Telangana Slang Role In New Movie-ఆ సినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకుంటున్న కృతి శెట్టి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్ ని ఈ సినిమాకి పెట్టారు.మనం ప్రేమించే అమ్మాయి గురించి మొదటి సారి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినపుడు ఎలా మొదలుపెడతాం అనే ఎలిమెంట్ తో ఈ కథాంశం ఉండబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం కృతి శెట్టి తెలంగాణ పిల్ల అవతారం ఎత్తబోతున్నట్లు తెలుస్తుంది.ప్రత్యేకంగా తెలంగాణ యాసలో ఆమె మాట్లాడుతుందని బోగట్టా.దీనికోసం సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇప్పటి నుంచే తెలుగు ప్రాక్టీస్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.ఈ మధ్యకాలంలో తెలంగాణ మాండలికం వాడే హీరోయిన్స్ ఎక్కువగా ఫేమస్ అవుతున్నారు.

ఇప్పుడు కృతి శెట్టి కూడా తన హవాని కొనసాగిస్తూ సుదీర్ బాబుని బుట్టలో పడేసే ఆ అమ్మాయి పాత్రలో ఎలా కనిపించబోతుందో ఆసక్తికరంగా మారింది.మరో వైపు శ్యామ్ సింగరాయ్ షూటింగ్ లో ఇప్పటికే ఈ అమ్మడు జాయిన్ అయినట్లు తెలుస్తుంది.

#Sudheer Babu #Telangana Slang #@Krithi_Fans #@KrithiShettyFP #@yourskrithi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు