మెగా మేనల్లుడుతో కృతి శెట్టి రొమాన్స్..!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ కృతి శెట్టి ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా వరుసగా అరడజను సినిమాల దాకా ఛాన్సులు అందుకుంది.

ఉప్పెన తర్వాత శ్యాం సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో కూడా అమ్మడు హిట్ కొట్టేసింది.

ప్రస్తుతం సుధీర్ బాబు, రామ్, నితిన్ లతో సినిమాలు చేస్తుంది.ఈ సినిమాలతో పాటుగా లేటెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం సినిమా తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి తేజ్ నటిస్తున్నాడని తెలుస్తుంది.ఈ సినిమాను జీ స్టూడియోస్ వారు నిర్మిస్తున్నారు.పవన్ తో పాటుగా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని టాక్.

సాయి తేజ్ కి జోడీగా కృతి శెట్టికి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.ఉప్పెనలో తమ్ముడు వైష్ణవ్ తేజ్ తో రొమాన్స్ చేసిన కృతి శెట్టి ఇప్పుడు అన్న సాయి తేజ్ తో జోడీ కడుతుంది.

Advertisement
Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

తాజా వార్తలు