చైతు సినిమా కోసం కృతి శెట్టి భారీ రెమ్యునరేషన్..!

వరుస సూపర్ హిట్ లతో దూసుకెళ్తున్న అందాల భామ కృతి శెట్టి తన నెక్స్ట్ సినిమాని కన్ ఫర్మ్ చేసింది.అక్కినేని హీరో నాగ చైతన్యతో మరోసారి కృతి శెట్టి రొమాన్స్ చేస్తుంది.

 Krithi Shetty Huge Remuneration Demand For Naga Chaitanya Movie Details, Naga Chaitanya, Krithi Shetty, Director Venkat Prabhu, Krithi Shetty Remuneration, Two Crores Remuneration, Naga Chaitanya Krithi Shetty-TeluguStop.com

నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు డైరక్షన్ లో తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది.ఇప్పటికే వరుస క్రేజీ మూవీస్ తో సత్తా చాటుతున్న కృతి శెట్టి ఈ ప్రాజెక్ట్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది.

నాగ చైతన్యతో ఆల్రెడీ బంగార్రాజు సినిమా చేసిన కృతి శెట్టి ఈ సినిమాతో మరోసారి చైతు సరసన ఛాన్స్ దక్కించుకుంది.ఇక ఈ సినిమాలో నటించేందుకు గాను కృతి శెట్టి భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది.

 Krithi Shetty Huge Remuneration Demand For Naga Chaitanya Movie Details, Naga Chaitanya, Krithi Shetty, Director Venkat Prabhu, Krithi Shetty Remuneration, Two Crores Remuneration, Naga Chaitanya Krithi Shetty-చైతు సినిమా కోసం కృతి శెట్టి భారీ రెమ్యునరేషన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉప్పెనతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి శ్యాం సింగ రాయ్, బంగర్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది.ప్రస్తుతం రామ్ తో ది వారియర్, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తుంది.

ఈ సినిమాలకు కోటిన్నర దాకా రెమ్యునరేషన్ తీసుకున్న అమ్మడు నాగ చైతన్యతో చేస్తున్న సినిమాకు 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube