హ్యాట్రిక్ విజయాలతో.. కృతి శెట్టి ఆ హీరోయిన్ల సరసన చేరిపోయింది?

సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదటి సినిమాతోనే విజయం అందుకోవడం చాలా కష్టం ఎందుకంటే అప్పటివరకూ ప్రేక్షకులకు ముక్కు మొఖం తెలియని హీరోయిన్ ను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది.ఇక అదృష్టం కలిసి వచ్చి మొదటి సినిమానే మంచి విజయం సాధించింది ఇక అంటే ఆ హీరోయిన్ ఎక్కడో సుడి ఉన్నట్లే అని అంటూ ఉంటారు విశ్లేషకులు.

 Krithi Shetty Hattricks In Tollywood, Krithi Shetty , Bangarraju , Uppena , Tollywood , Samantha , Anupama A Aa Movie-TeluguStop.com

మొదటి సినిమా విజయం సాధించినప్పటికీ తర్వాత సినిమాల్లో మాత్రం కొంత మంది హీరోయిన్లు డీలా పడిపోతుంటారు.కాని మొదటి సినిమాతో మొదలుపెట్టి వరుసగా విజయాలు సాధించడం మాత్రం కొంతమందికే సాధ్యం అవుతూ ఉంటుంది.

ఇక అలాంటి హీరోయిన్లు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు ఉండగా ఇక ఇటీవల టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని రోజుల్లోనే హ్యాట్రిక్ హిట్ లు సాధించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది కృతి శెట్టి.ఉప్పెన అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయింది.మొదటి సినిమానే సూపర్ సక్సెస్ సాధించింది.ఈ అమ్మడి అందం అభినయానికి తెలుగు ప్రేక్షకులు కూడా మంత్రముగ్ధులు అయ్యారు.ఆ తరువాత ఇటీవలే శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఇక ఈ సినిమాలో లిప్ లాక్ లతో రచ్చరచ్చ చేసింది.

 Krithi Shetty Hattricks In Tollywood, Krithi Shetty , Bangarraju , Uppena , Tollywood , Samantha , Anupama A Aa Movie-హ్యాట్రిక్ విజయాలతో.. కృతి శెట్టి ఆ హీరోయిన్ల సరసన చేరిపోయింది-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇటీవలే అక్కినేని హీరోలతో కలిసి నటించిన బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంక్రాంతికి కూడా హిట్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.ఇలా హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకుంది.

Telugu Anupama Aa, Bangarraju, Krithi Shetty, Samantha, Tollywood, Uppena-Latest News - Telugu

అయితే కృతి శెట్టి కంటే ముందు అనుపమ హ్యాట్రిక్ రికార్డు సాధించింది అని తెలుస్తోంది.2016లో నితిన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అ ఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ తన నటనతో అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఇక ఆ తర్వాత నటించిన ప్రేమమ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఆ తర్వాత 2017 లో శర్వానంద్ హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ శతమానం భవతితో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.ఇలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూడు సినిమాలు కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది అనుపమ పరమేశ్వరన్.

Telugu Anupama Aa, Bangarraju, Krithi Shetty, Samantha, Tollywood, Uppena-Latest News - Telugu

ఇలా హ్యాట్రిక్ హీరోయిన్ల కోవలోకే వస్తుంది ప్రస్తుత స్టార్ హీరోయిన్ సమంత.కేవలం హ్యాట్రిక్ కొట్టడం కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోయింది సమంత.ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ యూత్ అందరినీ ఆకర్షించి మంచి విజయాన్ని అందుకుంది.ఆ తర్వాత ఎన్టీఆర్తో బృందావనం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఈ సినిమా కూడా సూపర్ హిట్టే.ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో దూకుడు సినిమాలో నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

ఆ తర్వాత ఈగ తో మరో హిట్ కథలో వేసుకుంది.ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సమంత ఇప్పటికీ తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube