ఈవెంట్ మేనేజర్లకు బేబమ్మ ఝలక్.. అన్ని లక్షలు కావాలంట.?

తెలుగులో ఉప్పెన సినిమాలో నటించి ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు కృతిశెట్టి.ఉప్పెన మూవీ కోసం 2,000 మందిని అడిషన్స్ చేయగా అంతమందిలో కృతిశెట్టి హీరోయిన్ గా ఎంపికయ్యారు.

 Heroine Krithi Shetty Demand  Huge Remuneration For Event Launch , Krithi Shetty-TeluguStop.com

ఉప్పెన మూవీ కోసం తెలుగు నేర్చుకున్న కృతిశెట్టి ఆ సినిమాలో డబ్బింగ్ చెప్పకపోయినా భవిష్యత్తులో తెలుగులో డబ్బింగ్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు.

కృతిశెట్టి పేరుతో కంటే బేబమ్మ పేరుతోనే ఫేమస్ అయిన కృతి శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలో కూడా నటిస్తున్నారు.అయితే ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ తో రెమ్యునరేషన్ పెంచేసిన బేబమ్మ ఈవెంట్ మేనేజర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

Telugu Rupees, Managers, Evnet Lauch, Krithi Shetty, Shyam Singarai, Sudheer Bab

కృతిశెట్టి ఏదైనా లాంఛ్ ఆఫర్ వస్తే 14 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.కృతిశెట్టి డిమాండ్ ఈవెంట్ మేనేజర్లను సైతం అవాక్కయ్యేలా చేస్తున్నట్టు తెలుస్తోంది.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా కృతి తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.కృతి హీరోయిన్ గా నటించే మరో రెండు సినిమాలు హిట్టైతే మాత్రం ఆమెకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు రావడం గ్యారంటీ అని చెప్పవచ్చు.

అయితే కృతిశెట్టి గ్లామర్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాల్సి ఉంది.మరోవైపు గూగుల్ కృతిశెట్టిని గుర్తించడం లేదంటూ ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

గూగుల్ లో కృతిశెట్టి పేరును ఎంటర్ చేయగానే మరో హీరోయిన్ పేరు కనిపిస్తూ ఉండటంతో గూగుల్ తమ ఫేవరెట్ హీరోయిన్ ను గుర్తించాలంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube