వామ్మో బేబమ్మ ఇన్ని భాషలు మాట్లాడగలదా... వెరీ టాలెంటెడ్!

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్ర ద్వారా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

 Krithi Shetty Can Speak So Many Languages She Is Very Talented Krithi Shetty, To-TeluguStop.com

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఆలితో సరదాగా కార్యక్రమానికి వచ్చిన ఈమె ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఈ క్రమంలోనే మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అలీ ప్రశ్నించగా తనకు రామ్ చరణ్ అంటే ఎంతో ఇష్టమని ఎప్పటికైనా తనతో కలిసి నటించాలనే కోరిక ఉందని తెలిపారు.

ఇక రామ్ చరణ్ నటించిన సినిమాల్లో తనకు రంగస్థలం సినిమా అంటే ఎంతో ఇష్టం అనే విషయాన్ని కూడా తెలిపారు.ఈ క్రమంలోనే తనకు చాలా భాషలు మాట్లాడటం కూడా వచ్చనే విషయాన్ని ఈ కార్యక్రమంలో కృతి శెట్టి తెలియజేశారు.

Telugu Bangarraju, Krithi Shetty, Nagarjuna, Languages, Tollywood, Uppena-Movie

తాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తుళు బాగా మాట్లాడతానని కన్నడ అర్థమవుతుందని ఇప్పుడిప్పుడే తమిళం కూడా నేర్చుకుంటున్నానని ఈ కార్యక్రమంలో భాగంగా కృతి శెట్టి తెలియజేశారు.ఇలా కృతి శెట్టికి ఇన్ని భాషలలో మాట్లాడటం వచ్చని తెలియడంతో అభిమానులు బేబమ్మ మల్టీ టాలెంటెడ్ అంటూ తన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇకపోతే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా బంగార్రాజు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి శెట్టి మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube