లిమిట్స్ లో ఉండాలంటూ చిరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ కృష్ణ వంశీ ఒకరు.సింధూరం మురారి ఖడ్గం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి ఈయన త్వరలోనే రంగమార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇదిలా ఉండగా తాజాగా కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 Director Krishna Vamsi Made Interesting Comments About Chiru To Stay In Limits,-TeluguStop.com
Telugu Chiru, Krishnavansh, Chiranjeevi, Rangamarthanda, Tollywood-Movie

ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ తనకు చిరంజీవి అన్నయ్యతో చాలా మంచి అనుబంధం ఉంది తనని అన్నయ్య అని పిలుస్తూ చాలా చనువుగా ఉంటానని అయితే తనని రంగమార్తాండ సినిమా కోసం వాయిస్ ఓవర్ చెబుతారా అని అడగడానికి చాలా సంకోచం వ్యక్తం చేశానని కృష్ణవంశీ తెలిపారు.ఇలా నేను ఆందోళన చెందుతుండగా అన్నయ్య నన్ను గమనించి ఎందుకయ్యా భయపడతావు అని అడగడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు.

Telugu Chiru, Krishnavansh, Chiranjeevi, Rangamarthanda, Tollywood-Movie

ఇండస్ట్రీలో ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి మనకు ఎంత చనువు ఉన్న తన సినిమాకు వాయిస్ ఓవర్ చెబుతారా అని వెంటనే అడగలేము కదా.చిరంజీవి గారు ఒక శిఖరం ఆయన ముందు మన లిమిట్స్ లో మనం ఉండాలి అంటూ చిరంజీవి గురించి కృష్ణవంశీ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక చిరంజీవి గారితో తాను అప్పట్లో సినిమా చేయాలని అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు.

చిరంజీవి గారి లాంటి హీరోకి కథ తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు ఆ కథకు ఆయన తప్ప ఎవరు సరిపోరు అనేలా కథ సిద్ధం చేయాలని అలాంటి కథ దొరికినప్పుడు తప్పనిసరిగా అన్నయ్యతో సినిమా చేస్తానంటూ ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube