బాలయ్య 100వ సినిమా షాకింగ్‌ న్యూస్‌

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గురించి గత కొంత కాలంగా మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతూనే ఉంది.ఎంతో మంది దర్శకులు ఈయన వందవ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు అంటూ మీడియాలో కథనాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.

 Krishnavamsi To Direct Balakrishna 100th Movie-TeluguStop.com

అయితే తాజాగా బాలయ్య 99వ చిత్రం ‘డిక్టేటర్‌’ విడుదల సందర్బంగా 100వ సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చాడు.తాను గతంలో నటించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కబోతున్న ‘ఆదిత్య 999’ చిత్రంలో నటిస్తాను అని, ఆ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తారని, ఆ సినిమాకు తాను కలం పడతాను అంటూ బాలయ్య ప్రకటించాడు.

కాని అది క్యాన్సిల్‌ అయినట్లుగా తెలుస్తోంది.తాజాగా బాలయ్య 100వ సినిమాకు మరో దర్శకుడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

టాలీవుడ్‌లో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా పేరున్న కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య 100వ సినిమా ఉండే అవకాశాలున్నాయంటూ ఒక వర్గం సినీ ప్రముఖులు అంటున్నారు.వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల బాలయ్య సన్నిహితులను కృష్ణవంశీ కలిశాడట.

ఆయన చెప్పిన కథ వారికి నచ్చడంతో పాటు, వారు బాలయ్యను ఒప్పించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం బాలయ్య లేపాక్షీ వేడుకల నిర్వహణలో బిజీగా ఉన్నాడు.

ఈనెలాఖరున ఆ వేడుకలు పూర్తి అవ్వనున్నాయి.ఆ తర్వాత 100వ సినిమా గురించిన ఏర్పాట్లలో బాలయ్య పడే అవకాశాలున్నాయి.

కృష్ణవంశీతో బాలయ్య సినిమాను కొందరు పుకార్లే అంటూ కొట్టి పారేస్తున్నారు.మరి చివరకు బాలయ్య 100వ సినిమా ఎవరితో అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube