కృష్ణవంశీకి ఇంకా మోజు ఉన్నట్లుంది.. బాలయ్య ప్లీజ్‌ ఒప్పుకోరాదా?  

Krishnavamshi wanted To Do Raithu Film With Balakrishna -

టాలీవుడ్‌లో ఒకప్పుడు క్రియేటివ్‌ డైరెక్టర్‌గా అందరి మన్ననలు అందుకుని, స్టార్‌ హీరోలు సైతం ఆయన దర్శకత్వంలో సినిమాలు చేయాలని కోరుకునేలా చేసిన దర్శకుడు కృష్ణవంశీ.కెరీర్‌ ప్రారంభించిన పది సంవత్సరాల పాటు ఆకాశమే హద్దుగా దూసుకు పోయాడు.

Krishnavamshi Wanted To Do Raithu Film With Balakrishna

కాని గత పదేళ్లుగా ఆయన కెరీర్‌ ఏమాత్రం సాఫీగా సాగడం లేదు.గత పదేళ్లలో అయిదు సినిమాలు తీయగా అన్ని సినిమాలు కూడా ఫ్లాప్‌ అయ్యాయి.

చివరిగా ఆయన నుండి వచ్చిన చిత్రాలు గోవిందుడు అందరి వాడేలే మరియు నక్షత్రం.ఈ రెండు సినిమాలు కూడా నిరాశనే మిగిల్చియి.

కృష్ణవంశీకి ఇంకా మోజు ఉన్నట్లుంది.. బాలయ్య ప్లీజ్‌ ఒప్పుకోరాదా-General-Telugu-Telugu Tollywood Photo Image

రెండేళ్లుగా కృష్ణవంశీ సినిమాలేమి చేయకుండా ఖాళీగా ఉన్నాడు.

నక్షత్రం చిత్రం చేస్తున్న సమయంలోనే కృష్ణవంశీ తర్వాత సినిమా గురించి మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈయన బాలకృష్ణతో కలిసి ‘రైతు’ అనే చిత్రంను చేయబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరిగింది.రైతు చిత్రంలో బాలకృష్ణతో పాటు ముఖ్యమైన పాత్ర కోసం అమితాబచ్చన్‌ను కూడా కలిశారు.

ముంబయి వెళ్లి అమితాబచ్చన్‌ను కృష్ణవంశీ మరియు బాలకృష్ణలు కలిశారు.కాని అమితాచ్చన్‌ నో చెప్పాడు.

బచ్చన్‌ నో చెప్పడంతో బాలయ్య కూడా ఆ సినిమా నుండి సైడ్‌ అయ్యాడు.సినిమాలోని ఆ పాత్రను అమితాబ్‌ చేస్తేనే బాగుంటుందనేది బాలయ్య అభిప్రాయం.

అందుకే బచ్చన్‌ చేయకుంటే నేను చేయను అన్నాడట.

తాజాగా సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేసిన కృష్ణవంశీ ‘రైతు’ సినిమా గురించి స్పందిస్తూ నాకు ఇంకా ఆ సినిమాపై ఆసక్తి ఉంది.

కాని సినిమాకు బాలకృష్ణ ముందుకు రావాలి.ఆయన ముందుకు వస్తేనే తప్ప సినిమాను నేను ప్రారంభించలేను అంటూ ప్రకటించాడు.దాంతో నందమూరి అభిమానులు మరియు సాదారణ ప్రేక్షకులు కూడా రైతు సినిమా కోసం ఒప్పుకోవాలంటూ బాలకృష్ణతో పట్టుబడుతున్నారు.కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోయే సినిమా ఏంటీ అనే విషయమై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆశిద్దాం.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Krishnavamshi Wanted To Do Raithu Film With Balakrishna Related Telugu News,Photos/Pics,Images..