సక్సెస్‌ కొట్టేలా కనిపిస్తున్నాడు

కమెడియన్‌గా నటించి మెప్పించిన సునీల్‌ హీరోగా మారి కెరీర్‌ ఆరంభంలో మంచి సక్సెస్‌లను అందుకున్నాడు.అయితే హీరోగా కొంత కాలం వరకే సునీల్‌ సక్సెస్‌లను కొనసాగించాడు.

 Krishnashtami Movie Teaser Talk-TeluguStop.com

గత కొంత కాలంగా సునీల్‌ వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు.దాంతో ఈయన కాస్త గ్యాప్‌ తీసుకుని తాజాగా ‘కృష్ణాష్టమి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

‘భీమవరం బుల్లోడు’ సినిమా విడుదలైన చాలా కాలంకు ఈ సినిమాతో వస్తున్న సునీల్‌ ఈసారి సక్సెస్‌ కొట్టేలా కనిపిస్తున్నాడు.

తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మరియు టీజర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది.

ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూసేలా ఈ సినిమా టీజర్‌ ఉంది.వాసు వర్మ దర్శకత్వంలో దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై మొదటి నుండే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.ఇక టీజర్‌ ఆకట్టుకునే విధంగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ మెచ్చే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

ఈ సినిమాతో సక్సెస్‌ అయితే సునీల్‌ కెరీర్‌ ముందుకు సాగుతుంది.లేనిచో హీరోగా సునీల్‌ కెరీర్‌ మరింత కష్టాల్లోకి నెట్టబడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube