రెమ్యునరేషన్ విషయంలో నసిగిన కోట.. నలిపేస్తారు జాగ్రత్తని హెచ్చరించిన కృష్ణంరాజు

సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తెర మీద ఏ పాత్ర వేసిన ఎంచక్కా అందులో ఒదిగిపోతారు.పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల మెప్పు పొందడంలో కోట దిట్ట.

 Krishnam Raju Suggestion To Kota Remuneration Details, Kota, Kota Srinivasa Rao,-TeluguStop.com

అయితే, కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చాలా ఇబ్బందులు పడ్డట్లు స్వయంగా ఆయనే పేర్కొన్నాడు.ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీ లొకేషన్ ఎక్కడో, ఏ టైంకు రావాలో అన్ని విషయాలు ఫోన్‌లోనో లేక మెసేజ్ ద్వారానో చెప్తున్నారు.

కానీ ఆ కాలంలో అసలు సమాచార వ్యవస్థ అంతగా లేదు.దాంతో కోట షూటింగ్ ఎక్కడుందంటే అక్కడికి వెళ్లి చాలా సేపు కూర్చుండిపోయేవారట.

షూటింగ్‌లో భాగంగా కోట శ్రీనివాసరావు ఓ రోజు రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపీకృష్ణా ఆఫీసుకు వెళ్లారు.అప్పటికే కృష్ణం రాజు సినిమా ‘తాండ్ర పాపరాయుడు’ షూటింగ్‌లో పన్నెండు రోజులు పాల్గొన్నాడు కూడా.

ఆ చిత్రంలో కోట మంచి పాత్ర పోషించగా, ఆయన నటనను మూవీ యూనిట్ సభ్యులు మెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే కోట శ్రీనివాసరావుకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కృష్ణంరాజు బ్రదర్, ప్రభాస్ ఫాదర్ అయిన సూర్యనారాయణ రాజు ‘చెప్పండి శ్రీనివాసరావు గారు ఎంత ఇవ్వమంటారు?’రెమ్యునరేషన్ అని అడిగాడు.దాంతో కోట శ్రీనివాసరావు నసగడం స్టార్ట్ చేశాడు.ఈ క్రమంలో అప్పుడే అక్కడకు వచ్చిన కృష్ణం రాజు కోటను చూసి ఆగిపోయాడు.

ఈ క్రమంలోనే రెమ్యునరేషన్ విషయమై నసుగుతున్నట్లు సూర్యనారాయణ రాజు కృష్ణంరాజుకు చెప్పాడు.అప్పుడు కృష్ణం రాజు కోటకు పలు సూచనలిచ్చాడు.

Telugu Kota, Prabhas, Rebelkrishnam, Surya Yana Raju, Tollywood-Movie

సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అడిగితేనే ఇవ్వరని, అలాంటిది ఇలా నువ్వు నలిగితే అంతే సంగతులు అని, నలిపేస్తారు జాగ్రత్తని హెచ్చరించారు.దానికి కోట స్పందిస్తూ తానే ఏ వేషానికి ఎంత తీసుకోవాలో అర్థం కావడం లేదని చెప్పాడు.దానికి కృష్ణం రోజు బదులిచ్చాడు.పన్నెండు రోజులకుగాను రూ.20 వేలు తీసుకో.తర్వాత నీ రెమ్యునరేషన్ పెంచుకోవాలని చెప్పాడు.

అలా రెమ్యునరేషన్ విషయమై నలుగుతున్న కోటకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం చేశాడు రెబల్ స్టార్ కృష్ణం రాజు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube