ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు సీరియస్.. అదే కారణమా..?  

krishnam raju serious about prabhas-rahashyam-about his marrege-krishanm raju-tollywood-ahipurush-naga ashwin-channel interview - Telugu Krishnam Raju, Prabhas Marriage, Questions About Marriage, Radhe Shyam Movie

టాలీవుడ్ స్టార్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరనే ప్రశ్నకు ప్రభాస్ అని సమాధానం వినిపిస్తోంది.మిగతా స్టార్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు ఇప్పటికే పెళ్లి జరిగింది.

TeluguStop.com - Krishnam Raju Serious About Prabhas Marriage Questions

బాహుబలి 2 సినిమా తరువాత ప్రభాస్ పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.

ప్రభాస్ నటిస్తున్న నాలుగు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్టులే కావడం గమనార్హం.రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా సలార్ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోగా ఫిబ్రవరి తొలి వారం నుంచి ఆదిపురుష్ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

TeluguStop.com - ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు సీరియస్.. అదే కారణమా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ పనులు ఈ ఏడాది సెకండాఫ్ లో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.అయితే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఇప్పట్లో పెళ్లి చేసుకోరని తెలుస్తోంది.

Telugu Krishnam Raju, Prabhas Marriage, Questions About Marriage, Radhe Shyam Movie-Movie

నిన్న ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు పుట్టినరోజు కాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఆ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు తాను రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నానని తెలిపారు.ఆ పాత్రలో తాను గడ్డంతో కనిపిస్తానని ఆయన వెల్లడించారు.కృష్ణంరాజుకు ప్రభాస్ పెళ్లికి సంబంధించి ప్రశ్నలు ఎదురు కాగా ఆయన కొంచెం సీరియస్ అయ్యారు.యాంకర్ ప్రశ్నకు అయినప్పుడు ప్రభాస్ పెళ్లి అవుతుందని కృష్ణంరాజు పేర్కొన్నారు.

ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారని యాంకర్ చెప్పగా తాను కూడా ఎదురు చూస్తున్నానని కృష్ణంరాజు అన్నారు.ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.ప్రభాస్ పెళ్లి గురించి పదేపదే ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో కృష్ణంరాజు అసహనానికి గురై ఈ విధంగా కామెంట్లు చేశారని తెలుస్తోంది.

.

#QuestionsAbout #Krishnam Raju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు