ప్రభాస్, కృష్ణంరాజు కాంబినేషన్! రెబల్ రిజల్ట్ రిపీట్ కాదుకదా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.ఈ నేపధ్యంలో అతని ప్రతి సినిమా తెలుగుతో పాటు హిందీ ఇతర ఇండియా భాషలలో కూడా ఉండే విధంగా చూసుకుంటున్నాడు.

 Krishnam Raju Key Role In Prabhas New Movie-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పటికే సాహో సినిమా తర్వాత మరో సారి పాన్ ఇండియా హీరోగా నిరూపించుకున్న ప్రభాస్ ప్రస్తుతం జాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ త్వరలో మళ్ళీ మొదలు కానుంది.

ఇది పీరియాడికల్ లవ్ స్టొరీగా తెరకెక్కుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది.

ఇందులో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్రలో చేస్తున్నాడని, కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ రచయిత పరచూరి గోపాలకృష్ణ ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించారు.ఇక అన్నపూర్ణలో సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుగుతుందని తెలిపారు.

అయితే ప్రభాస్, కృష్ణంరాజు కాంబినేషన్ అంటే అందరికి వెంటనే గుర్తుకొచ్చే సినిమా రెబల్.లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీలలో ఒకటి.

ఇందులో ప్రభాస్ లుక్ స్టైలిష్ గా ఉన్నా కూడా సినిమా రిజల్ట్ మాత్రం దారుణంగా వచ్చింది.ఈ సినిమా ఎఫెక్ట్ వలన లారెన్స్ మరల తెలుగు సినిమా జోలికి రాలేదు.

దీంతో మరల వీరిద్దరి కాంబినేషన్ అంటే రెబల్ రిజల్ట్ రిపీట్ అవుతుందా అనే టెన్షన్ లో ప్రభాస్ ఫాన్స్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube