యూకే కోసం అపోలోకు.. రెబల్‌ స్టార్‌ ఆరోగ్యం పుకార్లపై క్లారిటీ

రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజుకు ప్రమాదం జరిగింది.ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 Krishnam Raju Health Update Social Media News Wrong-TeluguStop.com

ఆయన ఆరోగ్యం విషయమై ఆందోళనగా ఉంది ప్రభాస్ ముంబయి నుండి హైదరాబాద్‌ కు వస్తున్నాడు.సినీ ప్రముఖులు కృష్ణం రాజు ఆరోగ్య పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నారు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు.

ముఖ్యంగా ట్విట్టర్ లో కృష్ణం రాజు గారి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అభిమానులు చేసిన ట్రెండ్‌ అంతా ఇంత కాదు.మొత్తానికి రెబల్‌ స్టార్‌ ఆరోగ్య విషయమై క్లారిటీ వచ్చింది.

 Krishnam Raju Health Update Social Media News Wrong-యూకే కోసం అపోలోకు.. రెబల్‌ స్టార్‌ ఆరోగ్యం పుకార్లపై క్లారిటీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అసలు కృష్ణం రాజుకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదు.ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.

ఆయన ఆరోగ్యం గురించి మీడియాలో వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లు మాత్రమే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆయనకు సంబంధించిన ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కుటుంబ సభ్యులు ప్రెస్ నోట్‌ ను విడుదల చేశారు.

త్వరలో కృష్ణం రాజు యూకే వెళ్లబోతున్నారు.

అందుకే అపోలో లో జనరల్‌ చకప్‌ ను చేయించినట్లుగా చెబుతున్నారు.అదే సమయంలో సాయి ధరమ్‌ తేజ్‌ కుటుంబ సభ్యులతో కూడా కృష్ణం రాజు మాట్లాడాడు అంటూ పీర్ లు చెబుతున్నారు.

Telugu Apollo Hospitals, Film News, Krishna Raju Health Update, Krishnam Raju, Krishnam Raju Healthy, Prabhas, Sai Dhaaram Tej, Social Media, Tollywood, Wrong News-Movie

కృష్ణం రాజు కేవలం జనరల్‌ చెకప్‌ కోసం వెళ్లినా కూడా సోషల్‌ మీడియా జనాలు చేసిన హడావుడి చూసి అంతా కూడా అవాక్కవుతున్నారు.పెద్ద ఎత్తున సాయి ధరమ్‌ తేజ్‌ కోసం అపోలో ఆసుపత్రికి వెళ్తున్నారు.కృష్ణం రాజు కూడా అదే పని మీద వెళ్లాడు అనే విషయాన్ని కనీసం గుర్తించకుండా ఎవరికి తోచినది వారు సోషల్‌ మీడియాలో రాయడం.అది నిజం అనుకుని కొందరు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా మరియు వెబ్‌ మీడియా కూడా ఫాలో అవ్వడం జరిగింది.

అలా తప్పు జరిగి పోయింది అంటూ మీడియా వర్గాల వారు చెబుతున్నారు.

#Prabhas #Krishna Raju #Krishnam Raju #Sai Dhaaram Tej #KrishnamRaju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు