పెళ్లి వార్తలపై కృష్ణంరాజు ఫైర్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అంటూ ఒక ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో సర్కులేట్‌ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ అమ్మాయితో వచ్చే సంవత్సరం జూన్‌ లేదా జులైలో ప్రభాస్‌ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి.

 Krishnam Raju On Prabhas Marriage Rumors-TeluguStop.com

అయితే ఈ వార్తలపై రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.ప్రభాస్‌ పెళ్లి గురించి మీడియాలో వస్తున్న ఒక్క వార్త కూడా నిజం కాదని, అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని, ఫ్యాన్స్‌ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కృష్ణంరాజు తాజాగా ప్రకటించాడు.

ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు, ఎవరితో అనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అని, ఎప్పుడైతే ప్రభాస్‌ పెళ్లి నిశ్చయం అవుతుందో అప్పుడు తాను స్వయంగా మీడియాకు చెబుతాను అంటూ కృష్ణం రాజు చెప్పుకొచ్చాడు.అనధికారికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత పెళ్లి ప్రస్థావన తీసుకు వచ్చే అవకాశాలున్నాయి.

మొత్తానికి ప్రభాస్‌ పెళ్లి వార్తలు మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి.కృష్ణం రాజు క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ప్రభాస్‌ పెళ్లి వార్తలపై పుకార్లు ఆగుతాయని అనుకోవడం లేదు.

‘బాహుబలి’ సినిమా ప్రస్థావన వచ్చినన్ని రోజులు ప్రభాస్‌ పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube