కృష్ణలంక రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు.జగన్ చేతుల మీదుగా జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ పార్టీ నేతలు, మంత్రులు హాజరయ్యారు.

 Krishnalanka Retaining Wall Foundation By Ys Jagan Krishna,guntur,ys Jagan,andhr-TeluguStop.com

ఈ రిటైనింగ్ వాల్ తో కృష్ణలంక వాసులకు వరద కష్టాలు తీరనున్నాయి.దాదాపు 125 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరగనుంది.

ఈ నేపథ్యంలో అక్కడ ఇంజనీర్లు చేపట్టబోయే పనుల వివరాలను ముఖ్యమంత్రి జగన్ కు వివరించారు.అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో విజయవాడ నగరానికి చెందిన గెలిచిన కీలక నేతలు కూడా హాజరయ్యారు.

చాలా సందర్భాలలో వరదలు వచ్చిన సమయంలో కృష్ణలంక వాసులు అనేక అవస్థలు పడటంతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేయాలని డిసైడ్ అయింది.వచ్చే వర్షాకాలం నాటికి ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తి కానున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube