కృష్ణ వ్రింద విహారి ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. సినిమా ఎలా ఉందంటే?

కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను అందుకున్న నాగశౌర్యకు ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగులుతున్నాయి.ఈరోజు కృష్ణ వ్రింద విహారి సినిమాతో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 Krishna Vrinda Vihari Plus And Minus Points Details Here Goes Viral , Krishna Vrinda Vihari, Tollywood, Nagashowrya, Anish Krishna, Shirley Sethia-TeluguStop.com

ఇప్పటికే చాలాసార్లు రిలీజ్ డేట్లను మార్చుకున్న ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది.అనీష్ కృష్ణ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా అనీష్ కృష్ణ, నాగశౌర్యకు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు.

భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ సినిమా యావరేజ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Krishna Vrinda Vihari Plus And Minus Points Details Here Goes Viral , Krishna Vrinda Vihari, Tollywood, Nagashowrya, Anish Krishna, Shirley Sethia-కృష్ణ వ్రింద విహారి ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే.. సినిమా ఎలా ఉందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని కామెడీ సన్నివేశాలు మినహా ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలేవీ లేవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కథ, కథనం ఆకట్టుకునే విధంగా లేదని హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు బోరింగ్ గా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Anish Krishna, Krishnavrinda, Nagarya, Shirley Sethia, Tollywood-Movie

సినిమా నిదానంగా ఉండటం మైనస్ అయిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం బాగుందని ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ బెటర్ అని మరి కొందరు కామెంట్లు చేయడం గమనార్హం.కమర్షియల్ గా ఈ సినిమా సేఫ్ కావడం కష్టమేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.రికార్డ్ స్థాయిలో థియేటర్లలో ఈ సినిమా విడుదలైనా ఆక్యుపెన్సీ విషయంలో ఈ సినిమా నిరాశపరుస్తోంది.

ఏఎంబీ సినిమాస్ లో కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడంగమనార్హం.కొన్ని కామెడీ సీన్స్, నాగశౌర్య, షెర్లీ సేథియా నటన, మ్యూజిక్, కొన్ని ట్విస్టులు ఈ సినిమాకు ప్లస్ కాగా రొటీన్ కథ, కథనం, దర్శకత్వంలో చేసిన పొరపాట్లు ఈ సినిమాకు మైనస్ గా మారాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube