కృష్ణ, విజయనిర్మల వివాహం అసలు రహస్యం ఇదే  

Krishna Vijaya Nirmala Marriage-marriage,vijaya Nirmala,విజయ నిర్మల

సూపర్‌ స్టార్‌ కృష్ణ సతీమణి అయిన విజయ నిర్మల తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు. హీరోయిన్‌గా తెలుగు సినిమా చరిత్రలో తనదైన పేజీలను క్రియేట్‌ చేసుకున్న విజయనిర్మల దర్శకురాలిగా ప్రపంచ రికార్డ్‌నే సొంతం చేసుకున్నారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళ దర్శకురాలిగా ఆమెకు ఆ ఘనత దక్కింది..

కృష్ణ, విజయనిర్మల వివాహం అసలు రహస్యం ఇదే-Krishna Vijaya Nirmala Marriage

కృష్ణ మరియు విజయ నిర్మల చివరి వరకు ఎంత అన్యోన్యంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీరిద్దరికి కూడా రెండవ పెళ్లే అనే విషయం కూడా అందరికి తెల్సిందే.

కృష్ణ, విజయనిర్మల ఇద్దరు కూడా రెండవ పెళ్లి చేసుకోవడంకు కారణం ఏంటీ అసలు ఇద్దరి పెళ్లి విషయమై కొన్ని అనుమానాలు, రహస్యాలు ఇండస్ట్రీ వర్గాల వారికి కూడా తెలియదు.

కృష్ణకు చిన్నతనంలోనే వివాహం అయ్యింది. మామ కూతురు కావడం వల్ల అప్పట్లో ఇష్టం లేకుండానే కృష్ణ పెళ్లి చేసుకున్నాడట. ఇష్టం లేకుండా చేసుకున్నా కూడా ఇందిరాను మాత్రం ఎప్పుడు చిన్న చూపు చూడలేదట.

అదే సమయంలో తనతో పలు సినిమాల్లో నటించిన విజయ నిర్మలను ప్రేమించిన కృష్ణ ఆమెకు అప్పటికే పెళ్లి అయ్యిందనే విషయం తెలిసి కూడా ప్రపోజ్‌ చేయడం జరిగింది.

ఇద్దరు ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని, ఒకరి పరిస్థితి ఒకరికి తెలియడంతో రహస్య వివాహం చేసుకున్నాడు. తిరుపతిలో రమాప్రభ, నిర్మాత రాఘవ మరియు రాజాబాబుల సమక్షంలో వివాహం చేసుకున్నారట. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు ఎవరికి తెలియకుండా చెన్నైలోని ఒక ఇంట్లో ఉంటూ వచ్చారట.

విజయ నిర్మల తండ్రి రహస్య వివాహం కారణంగా రెండు సంవత్సరాలు మాట్లాడలేదట. మరో వైపు కృష్ణ ఫ్యామిలీ నుండి కూడా గొడవలు వచ్చాయి. అయితే ఇందిర గారు కృష్ణ గారి భార్యగానే ఉండాలని భావించారు..

దాంతో ఇద్దరు భార్యలను కృష్ణ సమానంగానే చూశారు.

విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇందిరా ద్వారా కృష్ణ గారికి పిల్లలు జన్మించారంటే అప్పటికి ఇందిర గారితో సంబంధాలు కొనసాగాయని, ఇప్పటికి కూడా మాటలు రాక పోకలు ఉండి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సుదీర్ఘ కాలంగా అన్యోన్యంగా ఉంటున్న వీరిద్దరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

ఇప్పుడు విజయ నిర్మల గారి మరణం కృష్ణగారికి తీరని లోటు. ఆయన ఒంటరి పక్షిలా మిగిలి పోయాడని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.