ఆ రోజు భోజనం పెట్టించినందుకే క్రిష్ణ వంశీ ఆయనతో ఆ సినిమా చేశాడా?

Krishna Vamsi Relation Between Brahmaji

క్రిష్ణ వంశీ. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుత సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు.ఆయన తీసిన ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.కొన్ని ఇండస్ట్రీ హిట్లు కూడా అందుకున్నాయి.అయితే ఆయన సినిమా పరిశ్రమలోకి రాని సమయంలో చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.సినిమా అవకాశాల కోసం మద్రాసు వీధుల్లో తిరుగుతున్న వేళ.ఎన్నో అవస్థలు పడ్డాడు.తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

 Krishna Vamsi Relation Between Brahmaji-TeluguStop.com

అదే సమయంలో ఒకసారి సుమారు 5 రోజుల పాటు భోజనం లేదు.నీరసం ఒళ్లంతా ఆవరించి కళ్లు తిరిగి పడిపోయే సమయంలో తనకు అండగా నిలిచాడు బ్రహ్మాజీ.

ఆకలితో అలమటిస్తున్న తనకు కడుపు నిండా భోజనం పెట్టిన గొప్ప వ్యక్తి బ్రహ్మాజీ అంటాడు క్రిష్ణ వంశీ.

 Krishna Vamsi Relation Between Brahmaji-ఆ రోజు భోజనం పెట్టించినందుకే క్రిష్ణ వంశీ ఆయనతో ఆ సినిమా చేశాడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనతో పాటే సినిమా అవకాశాల కోసం అప్పట్లో బ్రహ్మాజీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.అప్పుడు  బ్రహ్మాజీ పరిస్థితి కూడా సేమ్.తన దగ్గరున్న కొద్ది పాటి డబ్బును జాగ్రత్తగా వాడుకుంటున్నాడు.అదే సమయంలో క్రిష్ణ వంశీని ఓసారి భోజనానికి పిలిచాడు.నిజానికి తను ఎవరు భోజనానికి పిలిచినా.

వెళ్లేవాడిని కాదని చెప్పాడు.కానీ ఆరోజు తను పిలిచిన వెంటనే వెళ్లానని చెప్పాడు.

తాను భోజనం చేస్తూ.బ్రహ్మాజీ రుణం ఎలా తీర్చుకోవాలి ? అని ఆలోచించినట్లు చెప్పాడు క్రిష్ణ వంశీ.

Telugu Brahmaji, Brahmaji Gave, Krishna Vamshi, Krishna Vamsi, Krishnavamsi, Successful, Tollywood-Movie

అనుకున్నట్లుగానే కొంత కాలం తర్వాత దర్శకుడిగా ఎదిగాడు క్రిష్ణ వంశీ.ఆయన పలు సినిమాలు తీసి.మంచి పేరు సంపాదించాడు.ఒకానొక సమయంలో బ్రహ్మాజీని హీరోగా పెట్టి. సినిమా తీశాడు క్రిష్ణ వంశీ.ఆ రోజు భోజనం పెట్టినందుకే తనతో ఈ సినిమా తీశాడని ఆయన చెప్పాడు.

అయితే భోజనం పెట్టిన మాట వాస్తవం అని చెప్పిన క్రిష్ణ వంశీ.ఆయనలో టాలెంట్ ఉంది కాబట్టే సినిమా చేసినట్లు చెప్పాడు.

అలా చెప్పడం తన గొప్పతనం అని వెల్లడించాడు క్రిష్ణ వంశీ.

#Brahmaji #Krishna Vamsi #Brahmaji Gave #Krishna Vamshi #KrishnaVamsi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube