బాలకృష్ణ వలన సమంతకి ఇబ్బంది

నటసింహం నందమూరి బాలకృష్ణ వందో చిత్రం కోసం చాలా కసరత్తులు చేసి, ఆ డైరెక్టర్ అని, ఈ డైరెక్టర్ అని అందర్ని మార్చి చివరకి కృష్ణవంశీ దగ్గర ఆగారు.బాలకృష్ణ వందోవ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే.

 Krishna Vamsi Postpones Rudraksha For Balakrishna-TeluguStop.com

అయితే బాలకృష్ణ సినిమా వలన సమంత ఇబ్బందులు ఎదురుకుంటోంది.అది ఎలా అనే కదా మీ అనుమానం.

దిల్ రాజు బ్యానర్ లో “రుద్రాక్ష” అనే సినిమాను కృష్ణవంశీ అన్నౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.అందులో సమంత కథానాయిక.

అల్రేడి తన డేట్స్ కూడా ఇచ్చేసింది.ఇప్పుడు అనుకోకుండా బాలకృష్ణ సినిమా చేతికి చిక్కడంతో రుద్రాక్షను పక్కన పెట్టాడు మన క్రియేటివ్ డైరెక్టర్.

సినిమా పూర్తిగా ఆగిపోలేదు కాని, బాలకృష్ణ సినిమా పూర్తయ్యేదాకా మొదలుకాదు.

ఇప్పుడు సమంత డేట్స్ చాలావరకు వేస్ట్ అయిపోయాయి.

తనకన్నా సీనియర్లు, పెద్దవారు .ఇక సమంత మాత్రం ఏం ఎదురుచెప్తుంది.మే నెలలో బాలకృష్ణ – కృష్ణవంశీ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube