కృష్ణవంశీ ఫ్లాప్ సినిమాని తమిళంలో రిలీజ్

ఒకప్పుడు సినిమాలకి, నటులకి భాష ప్రాతిపాదిక ఎక్కువగా ఉండేది.ఎ భాష నటులు వారి భాషలకి సంబందించిన సినిమాలలోనే ఎక్కువగా నటించే వారు.

 Krishna Vamsi Nakshatram Movie Dubbed In Tamil-TeluguStop.com

అయితే ఇప్పుడు సినిమా అనేది యూనివర్శల్ అయిపొయింది.భాషలతో సంబంధం లేకుండా నటులు అన్ని చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న సినిమాలలో నటిస్తున్నారు.

హిందీ నటులు సౌత్ సినిమాలలో నటిస్తూ ఉంటే సౌత్ స్టార్స్, నటులు హిందీ సినిమాలలో కూడా నటిస్తున్నారు.ఇక హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సౌత్ లో ఎక్కువగా నటిస్తున్న హీరోయిన్స్ నార్త్ నుంచి వలస వచ్చినవారే.దీంతో ఇప్పుడు సినిమాకి హద్దులు చెరిగిపోయాయి.

ఈ కారణంగానే బాహుబలి, కేజీఎఫ్, సాహో లాంటి సౌత్ హీరోల సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటాయి.

దీనిని దృష్టిలో ఉంచుకొని హీరోలు కూడా తమ మార్కెట్ విస్తరించుకునే క్రమంలో తమ సినిమాలు ఇతర భాషలలో కూడా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు.

ఇక తమిళ హీరోల సినిమాలు అన్ని తెలుగులో రిలీజ్ అవుతున్నాయి.తెలుగు హీరోల సినిమాలు కూడా ఈ మధ్యకాలంలో తమిళంలో వెళ్తున్నాయి.ఈ నేపధ్యంలో హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కొన్ని పాత సినిమాలు కూడా ఒక భాష నుంచి వేరొక భాషలోకి డబ్బింగ్ చేసి వదులుతున్నారు.ఈ తరహాలోనే ఇప్పుడు కృష్ణవంశీ ఫ్లాప్ సినిమా నక్షత్రం ఇప్పుడు తమిళంలో రిలీజ్ కి రెడీ అవుతుంది.

సందీప్ కిషన్‌, సాయిధర్మ తేజ్‌, రెజీనా కసాండ్రా, శ్రియ, ప్రగ్యా జైశ్వాల్, ప్రకాష్‌రాజ్‌ లాంటి స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమాని అసురవంశం టైటిల్ తో తమిళంలో రిలీజ్ చేస్తున్నారు.సందీప్‌కిషన్‌, రెజీనా, శ్రియ, ప్రగ్యా, ప్రకాష్ రాజ్ లకి తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉండటంతో ఈ ఫ్లాప్ సినిమా తమిళ ప్రేక్షకులని నచ్చితుందని అక్కడి నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube