తెరాస గెలిస్తే నాగార్జున - కృష్ణ లకి మూడిందే !

ఒకప్పుడు ఎన్నికలు అంతో రాజకీయ నాయకులకి మాత్రమే సంబంధం.కానీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులు రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రులు గా అయిన తరవాత సినిమాకీ రాజకీయాలకీ మధ్యన ఉన్న దూరం తగ్గిపోయింది.

 Krishna – Nagarjuna For Greater Election-TeluguStop.com

ఇప్పుడు హైదరాబాద్ కార్పరేషన్ ఎన్నికల సమయంలో సినిమా వారి గొడవ ఎక్కువగా కనిపిస్తోంది.హైదరాబద్ కార్పరేషన్ ఎన్నికల్లో విమర్శలు హీరో నాగార్జున , హీరో కృష్ణ ల వైపుగా మళ్ళుతున్నాయి.

తెరాస ఇస్తున్న హామీలు చూస్తుంటే చెరువుల ఆక్రమణల తొలగింపూ, ప్రభుత్వ భూముల రక్షణ లాంటివి వారిద్దరి మెడకీ చుట్టుకునేలా కనిపిస్తున్నాయి.టీవీ చర్చల్లో ఎక్కువగా పాల్గొంటున్న నాయకులు ఈ వ్యవహారం మీద విమర్శలు కురిపిస్తూ ఉన్నారు.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కెసిఆర్ కావాలనే వదిలేసారు అంటూ గొడవ చేస్తున్నారు.దాంతో పాటు పద్మాలయా స్టూడియో సంగతి కూడా తెల్చమంటున్నారు ప్రతిపక్షం వారు.తెరాస జనాలు ఒక్క గజం కూడా ఆక్రమణ దారుల దగ్గర నుంచీ తీసుకోలేదు అనీ అధికారం రకముందర కూడా ఇలాగే చెప్పారు అంటూ ప్రతి విమర్శలు రావడం తో గ్రేటర్ లో గెలిస్తే గనక ఆక్రమణల విషయంలో సీరియస్ గా ఉండాలి అనుకుంటున్నారు తెరాస వారు.నాగార్జున ఎన్ కన్వెన్షన్ వ్యవహారం బోలెడు హడావుడి జరిగి, చప్పున చల్లారిన సంగతి తెలిసిందే.

అలాగే పద్మాలయా స్టూడియో వ్యవహారం కూడా చాలా ప్రకంపనలు సృష్టించిన సంగతి గుర్తున్నదే.మరి ప్రతిపక్షాలు వీటిని టార్గెట్ చేస్తే, ప్రభుత్వం తిరగతోడుతుందా? అసలే కేసిఆర్.మొండివాడికన్నా బలవంతుడు కదా.వీటిని లక్ష్యం పెడతారా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube