ఎన్టీఆర్ పోటీ పడి ఉన్న ఆస్తులు పోగొట్టుకున్న కృష్ణ

తెలుగు సినిమా పరిశ్రమ అప్పట్లో స్వర్ణయుగంగా ముందుకు సాగుతుంది.ఆ సమయంలో మాస్ హీరోలుగా ఎన్టీఆర్, కృష్ణ సత్తా చాటుతున్నారు.

 Krishna Lost His Properties Due To Ntr Details, Senior Ntr, Super Star Krishna,-TeluguStop.com

వీరిద్దరు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేస్తూ జనాల్లోకి దూసుకెళ్తున్నారు.వాస్తవానికి ఎన్టీఆర్ కి కృష్ణ పెద్ద అభిమాని.

ఆయన సినిమాలు చూస్తూనే నటన పట్ల ఇష్టం పెంచుకున్నాడు.అంతేకాదు.

సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ చేయూతనందించాడు.ఆ తర్వాత కొంత కాలానికి వీరిద్దరి మధ్య పోటీ ఏర్పడింది.

ఆ పోటీలో కృష్ణ పట్టుదలకు పోయి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.ఎన్టీఆర్ తో పోటీ వద్దు అని చాలా మంది చెప్పినా వినేవాడు కాదు కృష్ణ.

ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన రోజులున్నాయి.కానీ ఎప్పుడూ ఎన్టీఆర్ మీద సక్సెస్ అయిన సందర్భాలు లేవు.

అసలు వీరిద్దరి మధ్య విబేధాలకు ఓ సినిమా కారణం అయ్యింది.ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎన్టీఆర్ అప్పట్లో దాన వీర శూర కర్ణ సినిమా చేస్తున్నాడు.సినిమా పరిశ్రమ మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటుంది.

Telugu Assets, Box, Danaveerasoora, Disaster, Krishna, Krishna Sr Ntr, Kurukshet

అదే సమయంలో ఆ సినిమాకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం అనే సినిమా చేయాలనుకున్నాడు.ఆ సినిమాకు పోటీగా రిలీజ్ చేయాలనుకున్నాడు.ఎన్టీఆర్ సినిమాకు ఏ పెద్ద ఆర్టిస్టు అందుబాటులో ఉండకుండా చేయాలి అనుకున్నాడు.అందరినీ ముందుగానే బుక్ చేసుకుని అవుట్ డోర్ కి వెళ్లిపోయాడు.ఈ విషయం ఎన్టీఆర్ కు తెలిసింది.అయితే పెద్ద ఆర్టిస్టులు లేకపోయినా.

తానే నాలుగు క్యారెక్టర్లు చేశాడు ఎన్టీఆర్.దొరికిన చిన్నా చితకా నటులతోనే 40 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశాడు.

Telugu Assets, Box, Danaveerasoora, Disaster, Krishna, Krishna Sr Ntr, Kurukshet

ఆ సమయంలో దాన వీర శూర కర్ణ, కురుక్షేత్రం చిత్రాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.కురుక్షేత్రం సినిమాలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, మోహన్ బాబు, గుమ్మడి, సత్యనారాయణ సహా పలువురు గొప్ప నటులు నటించారు.కానీ దాన వీర శూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ ఒక్కడే.అయినా రెండు సినిమాలు విడుదల అయ్యాయి.దాన వీర శూర కర్ణ కనీ వినీ ఎరుగని విజయాన్ని అందుకుంది.కురుక్షేత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఈ సినిమా దెబ్బకు కృష్ణ తన ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube