కృష్ణుడు వెన్న దొంగలించడం వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?

మన హిందూ పురాణాల ప్రకారం హిందూ మతంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది.శ్రీకృష్ణుడు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో శుక్లపక్ష అష్టమి తిథి రోజున దేవికీ మాతకు ఎనిమిదవ సంతానంగా జన్మించారు.

 Krishna Janmashtami History And You Know Why Little Krishna Steal Butter, Krishn-TeluguStop.com

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారంగా, దేవకి ఎనిమిదవ సంతానంగా, జన్మించిన శ్రీ కృష్ణుని జయంతి రోజున దేశ వ్యాప్తంగా భక్తులు కృష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు.మధురలో చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుడు గోకులంలో యశోద సంరక్షణలో పెరిగాడు.

గోకులంలో కన్నయ్య ఎన్నో చిలిపి పనులు చేశారు.అందులో ఒకటి వెన్న దొంగలించడం.

గోకులంలో ఉన్న పిల్లలతో కలిసి కన్నయ్య అందరి ఇళ్ళల్లో వెన్నె దొంగతనం చేతి తినేవాడని మనకు తెలిసిందే.అయితే కృష్ణుడు వెన్నను దొంగిలించడానికి కారణం ఏమిటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

గోకులంలో పెరిగిన కన్నయ్య ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు.కన్నయ్య లీలలు తెలియని వారు మాత్రం ఆయన ఒక దొంగ అని భావిస్తారు.అయితే కృష్ణుడు చేసే ప్రతి పని వెనుక అతని లీలలు దాగి ఉన్నాయి.ముఖ్యంగా శ్రీకృష్ణుడు వెన్న దొంగలించడం వల్ల గోకులం లో నివసించే ప్రతి ఒక్కరి మధ్య ఐక్యత నెలకొనిందని చెప్పవచ్చు.

కన్నయ్య తన స్నేహితులతో కలిసి అందరి ఇళ్ళలో దొంగతనానికి వెళ్ళినప్పుడు ఇంటిలో ఉట్టి పై ఉన్న వెన్నను తీసుకోవడం కోసం తన స్నేహితులు అందరూ కలిసి ఎంతో ఐక్యతతో ఒకరిపై ఒకరు నిలబడి దొంగలించడం కోసం సహకరించారు.ఈ విధంగా ఏదైనా కార్యం చేసేటప్పుడు ఐక్యతతో ఉండాలని చెప్పడం కోసమే కన్నయ్య ఈ విధంగా వెన్ను దొంగలించారు.

Telugu Krishna, Pooja, Steal Butter-Telugu Bhakthi

ఈ క్రమంలోనే కృష్ణాష్టమి ఈ రోజు చాలా మంది తల్లులు తమ చిన్నారులకు గోపికా, కృష్ణుల వేషం వేసి ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఉట్టి కొట్టే కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ఈ ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఘనంగా కృష్ణుడి జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube