కృష్ణ విషయంలో ఆయన జోస్యం నిజమైందట.. వరుసగా 17 ఫ్లాపులతో?

అల్లూరి సీతారామరాజు సినిమా పేరు వినగానే ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకొస్తారు.1974 సంవత్సరంలో ఈ సినిమా విడుదల కాగా కె.ఎస్.ఆర్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.విజయనిర్మల, జగ్గయ్య ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.కృష్ణ 100వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా 19 కేంద్రాలలో ఏకంగా 100 రోజులు ఆడటం గమనార్హం.

 Krishna Faced 17 Flops After Alluri Seetaramaraju Movie-TeluguStop.com

ఈ సినిమాకు ఎన్నో అవార్డులు రాగా సినిమాలోని తెలుగువీర లేవరా పాట రచయిత శ్రీశ్రీకి జాతీయ పురస్కారం దక్కింది.

చిత్తూరు జిల్లాలో హార్సిలీ హిల్స్ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు సినిమాలోని ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది.ఈ సినిమా తొలి కలర్ స్కోప్ సినిమాగా అరుదైన రికార్డును అందుకుంది.

 Krishna Faced 17 Flops After Alluri Seetaramaraju Movie-కృష్ణ విషయంలో ఆయన జోస్యం నిజమైందట.. వరుసగా 17 ఫ్లాపులతో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు కథలో నటించాలని అనుకున్నా కొన్ని కారణాల వల్ల సాధ్యం కాలేదు.

కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సక్సెస్ సాధించిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాను చూసి కృష్ణ ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారని మెచ్చుకున్నారు.

Telugu 17 Flops, Alluri Seetaramaraju Movie, Interesting Facts, Krishna, Krishna 17 Flops, Padipantalu Movie, Super Star Krishna, Tollywood, Vijaya Chakrapani, Vijaya Chakrapani On Alluri Sitaramaraju Movie-Movie

ఫుల్ లెంగ్త్ ఇంగ్లీష్ సాంగ్ ఉన్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.అయితే అల్లూరి సీతారామరాజు ఇండస్ట్రీ హిట్ సాధించిన తర్వాత కృష్ణ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.అల్లూరి సీతారామరాజు సినిమా చూసి విజయ చక్రపాణి ఇకపై కొన్ని సంవత్సరాలు కృష్ణను సాధారణ సినిమాల్లో చూడలేరని చెప్పగా ఆయన జోస్యం నిజమైంది.

Telugu 17 Flops, Alluri Seetaramaraju Movie, Interesting Facts, Krishna, Krishna 17 Flops, Padipantalu Movie, Super Star Krishna, Tollywood, Vijaya Chakrapani, Vijaya Chakrapani On Alluri Sitaramaraju Movie-Movie

అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత వరుసగా 17 ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న కృష్ణ పాడిపంటలు సినిమాతో సక్సెస్ సాధించారు.అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణ ప్రజల హృదయాల్లో నిలిచిపోవడం గమనార్హం.కృష్ణ ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

#Krishna Flops #Seetaramaraju #Krishna #Padipantalu #Flops

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు