కామాంధుడి పైశాచికం.. ఎనిమిది ఏళ్ల చిన్నారిపై దారుణం.. !?

సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తుంటే నేడు యువత ఎటువైపు ప్రయాణిస్తుందనే అనుమానం వస్తుంది.పూర్తిగా జల్సాలకు అలవాటు పడిన యువకులు ఆ మత్తులో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నామన్న విషయాన్ని మరచిపోతున్నారు.

 Krishna District A Young Man Rapes A Child-TeluguStop.com

ఇందులో తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉందా? లేక ఈనాటి పిల్లల ఆలోచనల్లో తేడా ఉందా? తెలియడం లేదు.మొత్తానికి మరణ శిక్షలు, ఎన్‌కౌంటర్లు ఎవరిలో మార్పు తేవడం లేదు.

ఇకపోతే ఓ 18 సంవత్సరాల యువకుడు ఎనిమిది సంవత్సరాల వయసున్న అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.

 Krishna District A Young Man Rapes A Child-కామాంధుడి పైశాచికం.. ఎనిమిది ఏళ్ల చిన్నారిపై దారుణం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కృష్ణాజిల్లా, పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం, నీళ్ళ పూడి గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై 18 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం తీవ్ర రక్తస్రావంతో ఆ బాలిక ఏడుస్తూ తన తల్లి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పగా వెంటనే బాధితురాలి కుటుంబ సభ్యులు కృత్తివెన్ను పోలీసులను ఆశ్రయించారు.ఇక కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

#Police Case #Andhra Pradesh #Rape #Child #Hospital

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు