హైదరాబాద్‌ జలసౌధలో పలు మార్పులు.. వైజాగ్‌ వెళ్లనున్న కృష్ణా బోర్డు.. !

ఇంతకాలం కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం హైదరాబాద్‌లోని జలసౌధ భవన సముదాయం లో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ కృష్ణా బోర్డును ఏపీకి తరలించాలనే ప్రతిపాదన ఎప్పటి నుండో ఉంది.

 Krishna River Board Office To Be Shifted To Vizag, Jalasoudha, Hyderabad, Jalasa-TeluguStop.com

దాదాపు రెండు నెలలుగా కసరత్తు జరుగుతున్నా ఇప్పటికీ భవనాల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు.

ఈ నేపధ్యంలో తాజాగా కృష్ణా బోర్డు విషయంలో స్పందించిన ప్రభుత్వం ఇందులో భాగంగా సరైన భవనాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందం ఏప్రిల్ మొదటి వారంలో విశాఖపట్నం వెళ్లనున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ ప్రతిపాదనను గతేడాది అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి ఆమోదం తెలిపాయి.ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం లో బోర్డు హెడ్ క్వార్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బోర్డు యాజమాన్యానికి స్పష్టం చేసింది.

కాగా సరైన సౌకర్యాలున్న భవనాలను ఎంపిక చేసే ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారంలో పూర్తికానున్నట్లుగా సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube