మాయోన్ బృందం పొంగల్ ట్రీట్.. కృష్ణ భజన్ - మ్యూజికల్ డిలైట్..

Krishna Bhajan Song From Shibi Satyaraj Movie Maayon Going To Release

ఇప్పటికే విడుదలైనమాయోన్ టైటిల్ ట్రాక్’కి అద్భుతమైన స్పందన వచ్చింది.ఇది ఓ మైథలాజికల్ థ్రిల్లర్‌గా వస్తుంది.

 Krishna Bhajan Song From Shibi Satyaraj Movie Maayon Going To Release-TeluguStop.com

ఇప్పుడు ఈ చిత్ర మేకర్స్ తర్వాతి పాటకృష్ణ భజన – సింగార మధన మోహన’ను విడుదల చేయబోతున్నారు.పొంగల్/మకర సంక్రాంతి కానుకగా ఉదయం విడుదల చేయబోతున్నారు.

సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్, తాన్య రవిచంద్రన్ జంటగా నటిస్తున్న విజువల్ వండర్ మయోన్ సినిమా.ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ ప్లస్ మొదటి పాటకు మంచి రెస్సాన్స్ వచ్చింది.

 Krishna Bhajan Song From Shibi Satyaraj Movie Maayon Going To Release-మాయోన్ బృందం పొంగల్ ట్రీట్.. కృష్ణ భజన్ – మ్యూజికల్ డిలైట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇళయరాజా సంగీత సారథ్యంలో ఈ సినిమా వస్తుండటం గమనార్హం.కిషోర్ ఎన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇళయరాజా రాసి ట్యూన్ చేసిన ‘ది కిష్ణ భజన్’కి శ్రీనిధి శ్రీప్రకాష్ రచన చేసారు.కృష్ణ భగవానుని స్తుతిస్తూ నామసంకీర్తన రూపంలో ఏర్పాటు చేయబడింది ఈ పాట.ఇది వింటుంటే కచ్చితంగా అందరూ పాటతో కలిసి నాట్యం చేస్తారని చెప్తున్నారు చిత్రయూనిట్.అంత ఉల్లాసంగా పాట సాగుతుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా చెప్తున్నారు.

దశావతారం సినిమాలో ముకుందా ముకుందా తర్వాత కృష్ణ భగవానుడికి ఆ స్థాయిలో ట్రిబ్యూట్ ఇచ్చే పాట కృష్ణ భజన్ అంటున్నారు యూనిట్.ఇంత అద్భుతమైన పాటను మాయోన్ బృందం పొంగల్/మకర సంక్రాంతి సందర్భంగా ఈ ఆనందకరమైన పాటను పంచుకోవాలని నిర్ణయించుకుంది.

Telugu Shibi Satya Raj, Krishna Bhajan, Maayon, Mythological, Satya Raj Son, Shibi Satyaraj, Tollywood-Movie

డబుల్ మీనింగ్ ప్రొడక్షన్‌లో అరుణ్ మొళి మాణికం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు ఆయనే స్క్రీన్ ప్లే అందిస్తుండడం గమనార్హం.రామ్ పాండ్యన్ – కొండల రావు ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.కన్నుల పండుగగా ‘మాయోన్’ పాట అలరిస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:

శిబి సత్యరాజ్, తాన్య రవిచంద్రన్, రాధా రవి, కె.ఎస్.రవికుమార్, భగవతి పెరుమా, హరీష్ పేరడీ తదితరులు.

టెక్నికల్ టీం:

దర్శకుడు: కిశోర్ ఎన్ నిర్మాత: అరుణ్ మొళి మాణికం ప్రొడక్షన్: డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ DOP: రామ్ ప్రసాద్ ఎడిటర్: రామ్ పాండ్యన్ – కొండల రావు ఆర్ట్ డైరెక్టర్: బాలసుబ్రమణ్యన్ లిరిసిస్ట్: భాస్కరభట్ల రవికుమార్ లైన్ ప్రొడ్యూసర్: జిఏ హరికృష్ణణ్ విఎఫ్ఎక్స్: వినోద్ జేడీ స్టంట్స్: బిల్లా జెగన్ సౌండ్ మిక్సింగ్: రాజా కృష్ణణ్ పబ్లిసిటీ డిజైనర్: కన్నదాసన్ DKD PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

.

#Shibi Satya Raj #Shibi Satyaraj #Maayon #Mythological #Krishna Bhajan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube