పెళ్లి చేసుకున్న కృష్ణ అండ్ హిజ్ లీల హీరోయిన్

ఈ ఏడాది సౌత్ ఇండియా సెలబ్రిటీలు ఎక్కువ మంది పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.హీరో, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ అందరూ కూడా పెళ్లి చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నారు.

 Krishna And His Leela Actress Shalini Ties The Knot, Tollywood, Telugu Cinema, T-TeluguStop.com

ఇప్పుడు ఇదే దారిలోకి ఓ హీరోయిన్ కూడా వచ్చి చేరింది. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ షాలిని తాను ప్రేమించిన వ్యక్తితో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కింది.

కరోనా నిబంధనల మధ్య కేవలం తక్కువ మంది అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది.తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా తమిళంలో దర్శకుడుగా తనని తాని ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు.

ఇప్పటికే వంజ‌గ‌ర్ ఉలగం అనే సినిమా తీసి అక్కడ ఎంట్రీ ఇచ్చాడు.జోక‌ర్ సినిమాతో గొప్ప ప్ర‌శంస‌లందుకున్న గురు సోమసుంద‌రం ఇందులో లీడ్ రోల్ చేశాడు.

విభిన్న కథా చిత్రంగా ఈ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది.

షాలిని కొంత కాలం నుంచి మ‌నోజ్ తో రిలేష‌న్‌షిప్‌లో ఉంది.

ఇక ఈ అమ్మడు ప్ల‌స్ అనే క‌న్న‌డ సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచయం అయింది.ఆ త‌ర్వాత క‌న్న‌డ‌తో పాటు త‌మిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది.

తెలుగులో యురేక‌తో క‌థానాయిక‌గా ప‌రిచయం అయింది.కృష్ణ అండ్ హిజ్ లీల‌తోనే.

ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, షీరత్ కపూర్ లాంటి హీరోయిన్స్ ఉన్న కూడా వారికంటే ఎక్కువ మార్కులు పడ్డవి షాలిని పెర్ఫార్మెన్స్ కే.ఈ సినిమా తర్వాత షాలినికి టాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతాయని అందరూ భావించారు.అయితే ఊహించని విధంగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది.పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube