జూనియర్ బసవతారకం పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గ్రీష్మ నిహారిక!  

  • ఎన్టీఆర్ బయోపిక్ లో ఇప్పటికే కథానాయకుడు ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఫలితంతో షాక్ అయిన దర్శకుడు క్రిష్, ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగమైన మహానాయకుడులో కీలక మార్పులు చేస్తున్నాడు. మహానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ యుక్తవయసుకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు తీయడానికి రెడీ అవుతున్న క్రిష్ అందుకోసం ఎన్టీఆర్, బసవతారకం పాత్రలలో కొత్తనటులని తీసుకున్నాడు.

  • ఎన్టీఆర్ యుక్త వయసు పాత్రలో రంగస్థల నటుడుని ఎంపిక చేసిన క్రిష్, ఇక బసవతారకం పాత్రలో తెలుగు సినిమాలో బాలనటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గ్రీష్మ నిహారికని ఎంపిక చేసాడు. గతంలో ఈమె మల్లీశ్వరి సినిమాలో సీనియర్ హీరో నరేష్ కూతురుగా నటించింది. అలాగే పలువురు స్టార్ హీరోల చిత్రాల చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది .