పవర్ స్టార్ కోసం మెగాస్టార్‌ను కాకా పడుతున్న దర్శకుడు  

Krish Penning Story For Pawan Kalyan-janasena,krish,megastar,pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లాస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ తరువాత ఆయర పూర్తిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఆ తరువాత ఆయన మరే సినిమా చేయలేదు.కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన ఎప్పుడెప్పుడు సినిమా చేస్తాడా అనే ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

Krish Penning Story For Pawan Kalyan-janasena,krish,megastar,pawan Kalyan-Krish Penning Story For Pawan Kalyan-Janasena Krish Megastar Kalyan

కానీ పవన్‌ను మళ్లీ సినిమాల్లోకి తీసుకువచ్చేందుకు చాలా మంది చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి.అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ బలమైన వార్త వినిపిస్తోంది.దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు క్రిష్ ఇప్పుడు పవన్ కోసం ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు.

అయితే ఈ సారి క్రిష్ తన తెలివిని బాగా ఉపయోగిస్తున్నాడు.ఎటూ పవన్‌కు కథనను వినిపిస్తే ఆయన నో చెబుతాడని.క్రిష్ ఆ కథను మెగాస్టార్ చిరంజీవికి వినిపించేందుకు రెడీ అవుతున్నాడు.చిరుకు కథ చెప్పి ఆయనను ఒప్పించగలిగితే.కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారనే రీతిలో పవన్‌ను చిరు ఖచ్చితంగా ఒప్పించగలడనే ధీమా క్రిష్‌కు ఉందట.మరి పవన్ కోసం క్రిష్ తయారు చేస్తున్న కథ ఎంతటి రేంజ్‌లో ఉంటుందా అని ఆయన ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు.

ఏదేమైనా క్రిష్ ‘‘నీ తెలివి భళా’’ అని సినీ ఎక్స్‌పర్ట్స్ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.