ఇతర దర్శకులు క్రిష్‌లా ఎందుకు ఆలోచించడం లేదు?

సూపర్‌ హిట్స్‌ దక్కించుకున్న దర్శకులు పలువురు తదుపరి చిత్రాల కోసం నెలలకు నెలలు వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి.సుకుమార్‌ మరియు కొరటాల శివలు వారి తదుపరి చిత్రాల కోసం ఏకంగా మూడు సంవత్సరాలు వెయిట్‌ చేయాల్సి వచ్చింది.

 Krish Not Waiting For Pawan Kalyan Movie, Krish, Pawan Kalyan, Star Directors, S-TeluguStop.com

వారి విషయంలో అదృష్టం కలిసి రాలేదు అనుకోవచ్చు.ఇతర దర్శకులు కూడా చాలా సమయం వృదా చేస్తున్నారు అనేది అభిమానుల ఆవేదన.

ఒక హీరో కోసం వెయిట్‌ చేస్తూ చాలా సమయం వృదా చేసుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ.

ఒక దర్శకుడు హీరో కోసం వెయిట్‌ చేయడం వల్ల సమయం చాలా వృదా అవుతుంది.

ఆ హీరో ఖాళీగా లేడు అంటే గ్యాప్‌లో మరో సినిమాను చేసేందుకు ముందుకు రావాలి.అలా వచ్చినప్పుడే దర్శకుడు మరియు హీరోలు ఎక్కువ సినిమాలు చేయగలరు.పవన్‌తో సినిమాకు కమిట్‌ అయిన క్రిష్‌ కరోనా కారణంగా ఆ సినిమాను ఇప్పట్లో మొదలు పెట్టే పరిస్థితి లేదు.మొదట పవన్‌ వకీల్‌ సాబ్‌ను పూర్తి చేయాలి.

ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో సినిమాకు డేట్లు ఇస్తాడు.ఈ విషయంలో క్రిష్‌ మరో ఆలోచన లేకుండా కొత్త సినిమాను ప్రకటించాడు.

Telugu Krish, Netizens, Pawan Kalyan, Directors, Sukumar, Vakeel Sahebh-

పవన్‌ డేట్లు ఇచ్చేప్పటి వరకు ఈ చిన్న సినిమాను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడు. స్టార్‌ దర్శకులు కొందరు చిన్న సినిమా చేయడం ఎందుకు ఫలితం బెడిసి కొడితే ప్రమాదం అనే అనుమానాలతో సినిమాలు చేయడం లేదు.అందువల్ల వారు రెండు మూడు ఏళ్లకు ఒక సినిమా చొప్పున చేస్తున్నారు అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.క్రిష్‌ ను చూసి ఆ దర్శకులు ఎందుకు ఆలోచించడం లేదు అంటూ ఆయా దర్శకుల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube