వైష్ణవ్ తేజ్ సినిమా షూటింగ్ టాకీ పార్టీ ముగించేసిన క్రిష్  

Krish New Movie Shooting Completed, Tollywood, Telugu Cinema, Vaishnav Tej, Rakul Preet Singh - Telugu @dirkrish, Krish New Movie, Rakul Preet Singh, Telugu Cinema, Tollywood, Vaishnav Tej

క్రియేటివ్ దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి జాగర్లమూడి క్రిష్.రెగ్యులర్ కమర్షియల్ అంశాలకి దూరంగా కంటెంట్ బేస్ సినిమాలు చేయడంలో క్రిష్ అందెవేసిన చేయి.

TeluguStop.com - Krish New Movie Shooting Completed

అతను ఎంచుకున్న కథలలో ఏదో ఒక సామాజిక దృక్కోణం కచ్చితంగా ఉంటుంది.బలమైన కథలకి బలమైన హీరోలని తెరపై ఆవిష్కరిస్తారు.

పవన్ కళ్యాణ్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఓ పీరియాడికల్ కాన్సెప్ట్ తో సినిమాని ఎనౌన్స్ చేసిన క్రిష్ అంతకంటే ముందుగా వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమాని స్టార్ట్ చేసేశాడు.ఒక నవల ఆధారంగా ఈ సినిమా కథ సిద్ధం చేసుకొని చాలా వేగంగా సెట్స్ పైకి వెళ్ళిపోయాడు.

TeluguStop.com - వైష్ణవ్ తేజ్ సినిమా షూటింగ్ టాకీ పార్టీ ముగించేసిన క్రిష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు.కరోనా నుంచి కొంత విరామం దొరకగానే ఈ సినిమా షూటింగ్ ని వికారాబాద్ ఫారెస్ట్ లో క్రిష్ స్టార్ట్ చేసేశాడు.

ఎలాంటి హడావిడి లేకుండా నేరుగా షూటింగ్ కి వెళ్ళిపోయాడు.చాలా ప్లాన్ తో షూటింగ్ లు చేసి తక్కువ టైంలోనే షెడ్యూల్ పూర్తి చేసే దర్శకుల జాబితాలో క్రిష్ పేరు పూరి తర్వాత వినిపిస్తుంది.
గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ చిత్రాన్ని పరిమిత బడ్జెట్ లో 80 రోజుల్లోనే పూర్తి చేసి క్రిష్ అందరి ప్రశంసలు అందుకున్నాడు.రాజమౌళి సైతం క్రిష్ అంత వేగంగా తాను సినిమా తీయలేనని చెప్పేశాడు.

ఇప్పుడు వైష్ణవ్ తేజ్ సినిమా కూడా అలాగే ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి చేసేశాడు.ఓవైపు మహమ్మారి టాలీవుడ్ ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది.మిగిలిన సినిమా దర్శకులు షూటింగ్ స్టార్ట్ చేయడానికి భయపడుతున్న క్రిష్ మాత్రం లెక్కచేయకుండా సెట్స్ పైకి వెళ్ళిపోయాడు.వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ సహకరించడంతో షూటింగ్ పూర్తి చేసేసి షాకిచ్చారు.

క్రిష్ ఈ సినిమాని 40 రోజుల్లో ముగించాలని అనుకున్నాడు.ముందే చెప్పినట్టే గడువులోగా పనిని పూర్తి చేసి చూపించాడు.

మొత్తం టాకీ భాగం కేవలం 35 రోజుల్లో పూర్తి చేసేయగా, ఒక పాట మాత్రమే పెండింగ్.ఐదు రోజుల్లో దీని చిత్రీకరణ పూర్తవుతుందని తెలుస్తోంది.

#Krish New Movie #@DirKrish #Vaishnav Tej

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Krish New Movie Shooting Completed Related Telugu News,Photos/Pics,Images..