టెన్త్ క్లాస్ డైరీస్' ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేసిన క్రిష్ జాగర్లమూడి...

దర్శకుడి ఊహను అర్థం చేసుకుని అంతే అందంగా ప్రేక్షకులకు తన కెమెరా కంటితో చేరవేసేది ఛాయాగ్రాహకులే.సినిమా మేకింగ్‌లో సినిమాటోగ్రాఫర్ పాత్ర చాలా ఇంపార్టెంట్.

 Krish Jagarlamudi Released 'tenth Class Diaries' First Look ., Krish , Tenth Cla-TeluguStop.com

ఒకవేళ ఊహ, కెమెరా కన్ను ఒకరిదే అయితే? స్టోరీ టెల్లింగ్, సినిమా లుక్ హై స్టాండ‌ర్డ్స్‌లో ఉంటాయి.గతంలో మెగాఫోన్ పట్టిన సినిమాటోగ్రాఫర్స్ మంచి సినిమాలు అందించారు.

దర్శకులుగా మారిన ఛాయాగ్రాహకుల జాబితాలో ఇప్పుడు గరుడవేగ అంజి కూడా చేరనున్నారు.ది అంగ్రేజ్ సీతా రాముడు‘ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పరిచయమైన ఆయన తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు పని చేశారు.

దర్శకరత్న దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ, శ్రీనివాసరెడ్డి తదితర దర్శకుల ఊహలను వెండితెరపై ఆవిష్కరించారు.ఇప్పుడు ఓ సినిమాకు దర్శకుడిగా, ఛాయాగ్రాహకుడిగా రెండు బాధ్యతలు నిర్వర్తించారు.

గరుడవేగ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాటెన్త్ క్లాస్ డైరీస్ఛాయాగ్రాహకుడిగా ఆయన 50వ చిత్రమిది.అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు.ఇందులో శ్రీనివాసరెడ్డివెన్నెల రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీరాజా ఇతర ప్రధాన తారాగణం.

‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఫ‌స్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి ఈ రోజు విడుదల చేశారు.ముఖ్య తారాగణం అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

త్వరలో టీజర్, డిసెంబ‌ర్‌లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Telugu Achutha, Acutha Rama Rao, Archana, Avika, Garuda Anji, Himaja, Sriram, Te

నిర్మాతలు అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం మాట్లాడుతూ “విజయదశమికి మా సినిమా టైటిల్ వెల్లడించాం.చాలామంది ఫోన్లు చేసి ‘టెన్త్ క్లాస్ డైరీస్’ అనగానే.

ఒక్కసారి మా టెన్త్ క్లాస్ రోజులు గుర్తు చేసుకున్నామన్నారు.ప్రేక్షకులందరినీ నోస్టాల్జియాలోకి తీసుకువెళ్లే చిత్రమిది.

ఈ సినిమా విడుదలైన తర్వాత అవికా గోర్ అంటే ‘టెన్త్ క్లాస్ డైరీస్’ గుర్తుకు వస్తుంది.అంతలా పాత్రలో లీనమై అవికా గోర్ నటించారు.

కీలక పాత్రలో శ్రీరామ్ సైతం ప్రేక్షకులకు గుర్తుండే పాత్రలో కనిపిస్తారు.కథ ప్రకారం హైదరాబాద్, చిక్ మంగళూరు, రాజమండ్రి, అమెరికాలో షూటింగ్ చేశాం.

ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌కు లభిస్తున్న స్పందన మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది.

త్వరగా డబ్బింగ్, మిగతా పనులు పూర్తి చేసి… డిసెంబ‌ర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం అని అన్నారు.

Telugu Achutha, Acutha Rama Rao, Archana, Avika, Garuda Anji, Himaja, Sriram, Te

గరుడవేగ’ అంజి మాట్లాడుతూ కమర్షియల్ హంగులతో పాటు కొత్తదనం ఉన్న సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’.ప్రతి ఒక్కరి జీవితంలో టెన్త్ క్లాస్ అనేది ఒక టర్నింగ్ పాయింట్.స్నేహం, ఆకర్షణ, ప్రేమ, జీవిత లక్ష్యాలు, ఎన్నెన్నో కలలు… అన్నిటికీ పునాది టెన్త్ క్లాస్‌లో పడుతుంది.

జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా టెన్త్ క్లాస్ రోజులను ఎవరూ మర్చిపోలేరు.ప్రతి ఒక్కరికీ టెన్త్ క్లాస్ రోజులను గుర్తు చేసే విధంగా.స్నేహం, ప్రేమ, ఆకర్షణ, ఆకాంక్షలను స్పృశిస్తూ తీసిన చిత్రమిది.ప్రేక్షకుల హృదయానికి హత్తుకునే విధంగా సినిమా ఉంటుంది.

మా నిర్మాతలు, టెక్నికల్ టీమ్ సహకారంతో అనుకున్న విధంగా సినిమా వచ్చింది.అందరికీ నచ్చుతుంది” అని అన్నారు.

తారాగణం:

శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివ బాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, రాజశ్రీ నాయర్ , సత్యకృష్ణ, రూపలక్ష్మి, ‘తాగుబోతు’ రమేష్, ‘చిత్రం’ శ్రీను, గీతా సింగ్, రోహిణి (జబర్దస్త్), ‘జెమినీ సురేష్, ఓ మై గాడ్ని త్య, రాహుల్, ‘కంచెరపాలెం’ కేశవ, ప్రేమ్, భవ్య, కావేరి , అంబటి శ్రీను, జీవన్ (జబర్దస్త్), భాష, కేఏ పాల్ రాము, గణపతి (జబర్దస్త్), రాకేష్ (జబర్దస్త్), కమల్, మహేష్ మచిడి.

సాంకేతిక నిపుణుల వివరాలు:


కథ : రామారావు, స్క్రీన్ ప్లే – డైలాగ్స్: శ్రుతిక్, లిరిక్స్: చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, కొరియోగ్రఫీ: శేఖర్ వీజే, విజయ్ బిన్నీ, సన్నీ, ఫైట్స్: స్టంట్స్ జాషువా, పబ్లిసిటీ డిజైనర్: అనంత్, ప్రొడక్షన్ కంట్రోలర్: నరేన్ జి సూర్య, మేకప్: నారాయణ, కాస్ట్యూమ్స్: శ్రీదేవి కొల్లి, కో-డైరెక్టర్: విజయ్ కామిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, మ్యూజిక్ డైరెక్టర్: సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్: రవి కొల్లిపర, నిర్మాతలు: అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం, సినిమాటోగ్రఫీ & దర్శకత్వం : ‘గరుడవేగ’ అంజి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube