బాలకృష్ణ సినిమా దానికి కాపి కాదు అంట   Krish Cuts Down Copy Rumors On Gautamiputra Satakarni     2016-12-21   03:39:04  IST  Raghu V

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ట్రైలర్ చూసారుగా. పెద్ద పెద్ద సెటింగ్స్, ఆర్ట్ డైరెక్టర్ భారి పనితనంతో కలర్ ఫుల్ గా కనిపించింది ట్రైలర్. రాజమౌళి తరువాత పీరియాడిక్ మూవీ తీయాలంటే అది క్రిష్ వల్లే సాధ్యం అని విమర్శకులు సైతం వాఖ్యానించారు.

విమర్శకులు ప్రశంసలు అందిస్తే, సోషల్ మీడియాలో మాత్రం లేనిపోని విమర్శలు వస్తున్నాయి. ఇది హిందీ చిత్రం బాజీరావు మస్తానికి కాపిలా ఉందని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఫ్రేమ్స్ కూడా అలానే అనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ కామెంట్స్ లో అర్థం పర్థం లేదని దర్శకుడు క్రిష్ అంటున్నారు.

అసలు బాజీరావు మస్తానికి గౌతమీపుత్ర శాతకర్ణికి పోలికే లేదని, తెలుగు జాతి గర్వించదగ్గ రాజు చరిత్రని చెప్పబోతున్న చిత్రంపై ఇలాంటి రూమర్స్ ఎందుకు పుట్టుకోచ్చాయో అర్థం కావట్లేదని క్రిష్ చెప్పుకొచ్చారు.

మరి అంతేగా, బాజీరావు ఒక మరాఠీ రాజు. శాతకర్ణి తెలుగు రాజు. రాజులన్నాక రాజమందిరాలు ఒకేరకంగా అనిపించవచ్చు. కొద్దోగొప్పో వేషధారణ కూడా ఒకేరకంగా అనిపించవచ్చు. అంతమాత్రానికే గుడ్డిగా కాపి అనేస్తే ఎలా.

ఇక ఈ చిత్రం యొక్క ఆడియో ఈ నెల 26న విడుదల అవుతోంది. గౌతమీపుత్ర శాతకర్ణిలో శ్రియ కథానాయికగా కనిపించనుండగా, అలనాటి బాలివుడ్ నటి హేమా మాలిని బాలకృష్ణ తల్లిగా కనిపిస్తారు. నిర్మాతలు సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.