క్రిష్, వైష్ణవ్ తేజ్ మూవీకి కొండపొలం టైటిల్  

వైష్ణవ్ తేజ్ హీరోగా రెండో సినిమాని ఏకంగా క్రిష్ దర్శకత్వంలో చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ రెండో సినిమాని క్రిష్ దర్శకత్వంలోనే చేశాడు.

TeluguStop.com - Krish And Vaishnav Tej Film Based On Kondapolam

అలాగే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ రెండో సినిమాని కూడా క్రిష్ దర్శకత్వంలోనే చేశాడు.ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ హీరోయిన్ గా వైష్ణవ్ తేజ్ కి జోడీ కట్టే అవకాశం వచ్చింది.

కరోనా లాక్ డౌన్ ముగిసిన వెంటనే క్రిష్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఏకంగా సింగిల్ షెడ్యూల్ లో 45 రోజులు నిర్విరామంగా చిత్రీకరణ జరిపి పూర్తి చేశారు.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

TeluguStop.com - క్రిష్, వైష్ణవ్ తేజ్ మూవీకి కొండపొలం టైటిల్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఈ సినిమా కథ మొత్తం ఫారెస్ట్ నేపధ్యంలో గిరిజన కొండ భూముల కోసం రైతులు చేసే పోరాటంగా ఉండబోతుంది అని తెలుస్తుంది.కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమాని క్రిష్ తెరకెక్కించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి కూడా అదే టైటిల్ పెట్టాలని క్రిష్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది.కథ నేపధ్యం బట్టి అదే టైటిల్ పెడితే సినిమాకి యాప్ట్ అవుతుందని దర్శకుడు భావించి నవల టైటిల్ ని సినిమాకి పెట్టినట్లు సమాచారం.ఇక ఈ సినిమాని ఓటీటీ కోసం అని తెరకెక్కించిన అవుట్ పుట్ బాగా రావడంతో థియాట్రికల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అయితే వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకి రాలేదు.

ఇప్పటికే ఆ సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ కి కూడా రెడీ అయ్యింది.థియేటర్ లో రిలీజ్ చేయాలని ఎదురు చూస్తున్నారు.మరి వైష్ణవ్ తేజ్ కెరియర్ లో అతని అన్నయ్య మామయ్యా తరహాలోనే రెండో సినిమా ముందు రిలీజ్ అయ్యి మొదటి సినిమా తరువాత థియేటర్ లోకి వస్తుందేమో వేచి చూడాలి.

#Mega Heroes #KrishAnd #Kondapolam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు