నాలుగు ఫొటోలతో అంచనాలు పీక్స్‌కు తీసుకు వెళ్లాడు

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం నిరాశ పర్చింది.ఆ సినిమా ఫ్లాప్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ కాస్త సైలెంట్‌ అయినట్లుగా అనిపించింది.

 Kranthi Madavu And Vijay Devarakonda Movie Latest Update-TeluguStop.com

ఆయన జోరుకు బ్రేక్‌ పడిందా అంటూ అంతా అనుకున్నారు.క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రాన్ని ఎవరు నిన్న మొన్నటి వరకు పెద్దగా పట్టించుకోలేవు.

కాని ఇప్పుడు క్రాంతి మాధవ్‌ సినిమా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Arjunreddy, Love, Kranthi Madavu, Kranthimadavu, Lover-

ఈ చిత్రంలో నాలుగు విభిన్నమైన ప్రేమ కథలు ఉండబోతున్నాయి.నాలుగు ప్రేమ కథలకు గాను నలుగురు హీరోయిన్స్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా నాలుగు ప్రేమ కథలు ఉండబోతున్నాయంటూ నాలుగు పోస్టర్స్‌ ద్వారా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పకనే చెప్పారు.

నాలుగు ప్రేమ కథలు ఒకే సినిమాలో అంటే మామూలు విషయం కాదు.ఈ నాలుగు పోస్టర్‌లు సినిమాపై అంచనాలు పీక్స్‌కు తీసుకు వెళ్లాయి.

Telugu Arjunreddy, Love, Kranthi Madavu, Kranthimadavu, Lover-

నిన్నమొన్నటి వరకు ఎవరు కూడా వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రాన్ని పట్టించుకున్న నాధుడు లేడు.కాని ఎప్పుడైతే సినిమా పోస్టర్‌లు విడుదల అయ్యాయో సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి.తప్పకుండా సినిమా ఒక రేంజ్‌లో ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.క్రాంతి మాధవ్‌ సినిమా అంటే ఫీల్‌ గుడ్‌ మూవీ.తప్పకుండా ఇది ఫీల్‌ గుడ్‌ మూవీ అవ్వడంతో పాటు కమర్షియల్‌గా సెన్షేషనల్‌ మూవీ అవుతుందని ఈ సందర్బంగా ప్రేక్షకులు చాలా నమ్మకంగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube