క్రాక్ ట్రైలర్ టాక్: కాయ, నోటు, మేకు.. ఆటాడుకున్న పోతరాజు!

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రాక్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.

 Krack Movie Trailer Released, Krack, Raviteja, Shruti Hassan, Krack Trailer, Tol-TeluguStop.com

ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ క్రమంలో న్యూఇయర్ సందర్భంగా క్రాక్ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులకు రవితేజ ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నాడని స్పష్టం అవుతోంది.

విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యాంతం పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను మెప్పించింది.పోతరాజు వీరశంకర్‌గా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లకు ఎలాంటి కొదువ లేదని ఈ ట్రైలర్‌లోనే చూపెట్టాడు దర్శకుడు.

హీరోయిన్‌గా శృతి హాసన్ అందాలతో పాటు అదిరిపోయే పర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక వరలక్ష్మీ శరత్ కుమార్, సముథ్రకణిల పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలవబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.మొత్తానికి క్రాక్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకునేందుకు రవితేజ పవర్‌ప్యాక్ కంటెంట్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాతో రవితేజకు దర్శకుడు గోపీచంద్ మలినేని ఎలాంటి బ్లాక్‌బస్టర్‌ను అందిస్తాడో తెలియాలంటే సంక్రాంతి పండుగ వరకు వెయిట్ చేయాల్సిందే.నూతన సంవత్సర కానుకగా రిలీజ్ అయిన క్రాక్ ట్రైలర్‌ను మీరూ ఓసారి చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube