వకీల్ సాబ్ ఇచ్చే స్పేస్ బట్టి రవితేజ ముందుకి దూకుతాడు

కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాదిలో ఆరు నెలల కాలం పూర్తిగా నిద్రానంలోకి వెళ్ళిపోయింది అని చెప్పాలి.ఈ ఆరు నెలల కాలంలో వ్యవస్థలు అన్ని మూత బడ్డాయి.

 Krack Movie Release Date Depends On Vakeel Saab, Tollywood, Telugu Cinema, South-TeluguStop.com

వ్యవసాయం చేసే రైతులు, మెడిసన్ తయారు చేసే ఫార్మసీ కంపెనీలకి తప్ప మిగిలిన అన్ని రంగాలలో కరోనా విపరీతమైన ప్రభావం చూపించింది.ఇక కరోనా ఎఫెక్ట్ చిత్రపరిశ్రమ మీద కూడా తీవ్ర స్థాయిలో పడింది.

సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి, రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడిపోయాయి.ముందుగానే షెడ్యూల్ వేసుకొని రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకొని సినిమాలు అన్నింటికీ కూడా ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది.

ఈ కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లు వాయిదా పడటం వలన నిర్మాతలు కూడా ఆర్ధికంగా నష్టాలు చవిచూశారు.ఇదిలా ఉంటే కరోనా లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో ఆగిపోయిన అన్ని సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభమయ్యాయి.

అదే సమయంలో కొన్ని సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండటంతో సంక్రాంతి సీజన్ ని టార్గెట్ గా పెట్టుకున్నాయి.

సంక్రాంతి టైంలో సినిమాలు రిలీజ్ చేస్తే ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకి మంచి కలెక్షన్ వస్తాయి.

ఒకవేళ హిట్ అయితే తిరుగుండదు.చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని జనవరిలోనే ప్రేక్షకుల ముందుకి రావాలని అనుకుంటున్నాయి.

ఈ నేపధ్యంలో రవితేజ క్రాక్ సినిమా కూడా సంక్రాంతి లక్ష్యంగా పెట్టుకొని షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు.అయితే అదే సమయంలో పవర్ స్టార్ వకీల్ సాబ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తవడంతో దిల్ రాజు ఎలా అయినా సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు.అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

వకీల్ సాబ్ నుంచి వచ్చే క్లారిటీ బట్టి రవితేజ క్రాక్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవాలని భావిస్తున్నారు.వకీల్ సాబ్ సంక్రాంతికి రిలీజ్ అయితే అయితే ముందుగా రిలీజ్ చేయడం, లేదంటే ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం చేయాలని అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube