సినిమాలలో నటించడానికి అందం, నటన, అదృష్టం ఇవి మాత్రమే నటన జీవనానికి అవసరం.కానీ కొన్ని పరిశ్రమల లో కొందరు నిర్మాతలు కానీ, దర్శకులు కానీ నటించడానికి వచ్చే హీరోయిన్స్ లను ఒక రేంజ్ కు తీసుకెళ్తామంటూ వాళ్లను లోబర్చుకుంటారు.
ఇలా కొన్ని సినీ పరిశ్రమలోని మాత్రమే జరుగుతుంటాయి.అలాగే ఓ హీరోయిన్ కు కూడా తనకు జరిగిన చేదు అనుభవం గురించి అభిమానులతో పంచుకుంది.
తెలుగు సినీ పరిశ్రమకు మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామర్ తో ఎంట్రీ ఇచ్చిన అప్సర రాణి.తన గ్లామర్ తో కుర్రాళ్ల మనసులను దోచుకుంది.తన సినీ కెరీర్ లో కొన్ని చేదు అనుభవాలు ఎదురవడంతో.అభిమానులకు తన సంఘటన గురించి పంచుకుంది.
కొందరు హీరోయిన్లు తమకు జరిగిన అనుభవాల గురించి చెప్పుకోకుండా లోలోపల కుమిలిపోతుంటారు.కానీ మరికొందరు ఇలాంటి పరిస్థితులు మరో నటికి ఎదురుకాకుండా ఉండటానికి ముందుగానే చెబుతుంటారు.
ఇదివరకే ఎంతో మంది నటీమణులు తమకు జరిగిన చేదు అనుభవాల గురించి పంచుకున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ డైరెక్టర్ ఆర్జిీవి దర్శకత్వంలో థ్రిల్లర్ సినిమాలో తన అందంతో బాగా ఆకట్టుకుంది ఈ గ్లామర్ బ్యూటీ.
ఈ సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది.సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ తన బికినీ అందాలతో దిగిన ఫోటోలను బాగా షేర్ చేస్తూంటుంది.
ఇదిలా ఉంటే అప్సర రాణి కు మరో సినీ పరిశ్రమ అయినా కన్నడ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంపిక చేశారట.కానీ డిస్కర్షన్ కోసం మాత్రం రూమ్ కి ఒంటరిగా రమ్మన్నారని తెలిపింది.
కానీ ఆమె తన తండ్రితో కలిసి లోపలికి వెళ్లగానే అక్కడ ఉన్న పరిస్థితులు తమకు అర్థం కాగానే వెంటనే వెనక్కి వచ్చారని తెలిపింది.ఇలాంటివి తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎదురు కాలేదంటూ తెలుపగా.
తెలుగులో మంచి టాలెంట్ ను చూసి ఎంపిక చేస్తారని తెలిపింది.ఇటీవలే క్రాక్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే.