'క్రాక్‌' ఆహా రికార్డును రివీల్‌ చేసిన టీమ్‌... తెలుగులో టాప్ ఇదేనట

కరోనా లాక్‌ డౌన్‌ తర్వాత విడుదల అయిన మొదటి పెద్ద హీరో సినిమా క్రాక్‌ అనడంలో సందేహం లేదు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రవితేజ మరియు శృతి హాసన్ జంటగా నటించారు.

 Krack In Aha Ott Going With Record-TeluguStop.com

ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో పోలీస్‌ స్టోరీతో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగా నమోదు అయ్యాయి.అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో అభిమానులు సినీ ప్రేమికులు ఫ్యామిలీ ఆడియన్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా సినిమాను చూసేందుకు వెళ్లడంతో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.రూ.50 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది.బ్రేక్ ఈవెన్‌ కు డబుల్ ను వసూళ్లు చేసినట్లుగా సమాచారం అందుతోంది.చాలా తక్కువ సమయంలో ఆహా లో స్ట్రీమింగ్ అయిన క్రాక్ సినిమా అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆహా ను భారీ ఎత్తున ప్రమోట్‌ చేయడంతో పాటు ఆహా అన్నట్లుగా క్రాక్ ఉండటంతో ప్రేక్షకులు భారీ ఎత్తున చూశారు, ఇంకా చూస్తేనే ఉన్నారు.ఆహా టీం వారు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటి కే ఏకంగా 250 మిలియన్‌ వ్యూ మినిట్స్ ను ఈ సినిమా దక్కించుకుంది.

 Krack In Aha Ott Going With Record-క్రాక్‌’ ఆహా రికార్డును రివీల్‌ చేసిన టీమ్‌… తెలుగులో టాప్ ఇదేనట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఇంత తక్కువ సమయంలో దక్కించుకున్నది లేదు.మొదటి తెలుగు సినిమా గా ఇది నిలిచింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.

ప్రస్తుతం క్రాక్ సినిమా వ్యూస్‌ కాస్త తగ్గినా కూడా 300 మిలియన్ ల వ్యూ మినిట్స్ వరకు వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.కనుక క్రాక్ సినిమా తెలుగు లోనే టాప్ సినిమా గా చెప్పుకోవచ్చు.

.

#Krack #Ravi Teja #Allu Aravind #Sruthi Hassan #Aha OTT

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు