తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ పై కొంత మంది పెత్తనం ఎక్కువగా ఉంటుంది.థియేటర్స్ ని కొంత మంది నిర్మాతలు తమ చేతులోకి పెట్టుకొని వారి సినిమా రిలీజ్ కి రెడీ అయినపుడు ఎంత పెద్ద హిట్ సినిమా ఆ థియేటర్ లో అడుగుతున్న నిర్దాక్షిణ్యంగా తీసేసి తమ సినిమా వేసుకుంటారు.
అందుకే చిన్న నిర్మాతలు ఎప్పటికప్పుడు టాలీవుడ్ ని ఆ నలుగురు కబ్జా చేసేశారని అంటూ ఉంటారు.ఆ నలుగురులో దిల్ రాజు పేరు ఎక్కువగా బయటకి వస్తూ ఉంటుంది.
చాలా మంది చిన్న నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ నేరుగానే దిల్ రాజు మీద విమర్శలు చేస్తారు.దిల్ రాజు నిర్మాతగా ఉండటంతో పాటు పెద్ద సినిమాలని నైజాం ఏరియాలో డిస్టిబ్యూటర్ గా కూడా ఉన్నాడు.
ఇతర బాషలలో తెరకెక్కే పెద్ద సినిమాలని కొనేసి నైజాంలో రిలీజ్ చేస్తూ ఉంటారు.అయితే ఈ ఏరియాలో అతనితో పాటు ఉన్న మిగిలిన డిస్టిబ్యూటర్స్ దిల్ రాజు పెత్తనం తట్టుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం క్రాక్ సినిమాని నైజాం ఏరియాలో డిస్టిబ్యూట్ చేసిన వరంగల్ శ్రీను మీడియా ముందుకొచ్చి తన ఆవేదనని పంచుకున్నారు.అదే పనిలో దిల్ రాజుపై తీవ్ర విమర్శలు చేశారు.
క్రాక్ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.50 శాతం ఆక్యుపెన్సీతో కూడా హౌస్ ఫుల్ గా నడుస్తుంది.ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారు.అయితే విజయ్ మాస్టర్ తెలుగు నైజాం రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నాడు.ఈ నేపధ్యంలో క్రాక్ సినిమా విజయవంతంగా ఆడుతున్న మాస్టర్ సినిమా కోసం ఆ సినిమాని తీసేశారు.దీంతో ఫైనాన్సియల్ గా నష్టపోయే పరిస్థితి ఎదుర్కొంటున్న డిస్టిబ్యూటర్ మీడియా ముందుకొచ్చాడు.
సినిమా అంటే నాకు పిచ్చి . సినిమా ఫీల్డ్ కి వెళ్లి ఏదో ఒకటి చెయ్యాలని సినిమా ఇండస్త్రీకి వచ్చాను.కథలు పట్టుకొని డైరెక్షన్ ఛాన్స్ కోసం తిరిగాను.అవకాశాలు రాక డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను.పదిహేను ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో వున్నాను.ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ నైజాంలో రిలీజ్ చేశాను.
లేటెస్ట్ గా క్రాక్ మూవీ రిలీజ్ చేశాను.బ్లాక్ బస్టర్ హిట్ అయి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.
ఈ టైములో మా సినిమా తీసివేసి మాస్టర్ సినిమాకి ధియేటర్స్ ఇచ్చారు.ఒకప్పుడు తమిళ్ సినిమాలకి ధియేటర్స్ ఇవ్వొద్దు.
తెలుగు సినిమాలకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని స్టేజ్ ల మీద స్పీచ్ లు ఇచ్చారు.ఇప్పుడు ఆ మాట తప్పారు.
స్వాతంత్ర్య పోరాటం మాదిరిగా ఇప్పుడు ఒక విప్లవం రావాలి.ఎందుకంటే నైజాంలో ధియేటర్స్ విషయంలో దిల్ రాజు, శిరీష్ రెడ్డి గుత్తాధిపత్యాన్ని పెత్తనాన్ని కొనసాగిస్తుంన్నారు.
వారి నిరంకుశపాలనకి అడ్డుకట్ట వేసే దిశగా నా పోరాటం కొనసాగిస్తానని వరంగల్ శ్రీను మీడియా సమావేశంలో దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.