కెఆర్ విజయ రహస్య వివాహం వెనుకున్న అసలు కారణం ఏంటో తెలుసా?

Kr Vijaya Marriage Story Interesting Facts

సినిమా పరిశ్రమలో పెళ్లిళ్లు అనేవి చాలా చిత్ర విచిత్రంగా జరుగుతాయి.కొంత మంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే.

 Kr Vijaya Marriage Story Interesting Facts-TeluguStop.com

మరికొంత మంది సినిమా పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తులను పెళ్లి చేసుకుంటారు.కొందరు బహిరంగంగా పెళ్లి చేసుకుంటే.

మరికొందరు ఎవరికి చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంటారు.పెళ్లయ్యాక ఎప్పటికో గానీ ఈ విషయం బయటకు రాదు.

 Kr Vijaya Marriage Story Interesting Facts-కెఆర్ విజయ రహస్య వివాహం వెనుకున్న అసలు కారణం ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న తారల్లో ఒకరు కెఆర్ విజయ. ఈమె ఒకప్పుడు గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎన్నో సినిమాల్లో అద్భుత పాత్రలు పోషించి అందరిచేత ప్రశంసలు అందుకున్నారు కూడా.ఇంతకీ ఈమె ఎవరికీ తెలియకుండా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ అసలు పేరు దైవ నాయకి. తండ్రి పేరు రామచంద్ర.తెలుగువాడు.తల్లి కల్యాణి.

కేరళ మహిళ.విజయకు చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే ఎంతో ఇష్టం.

చెన్నైల్లో ఎన్నో నాటకాల్లో పాల్గొంది.ఆ తర్వాత 1963లో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.

గోపాల కృష్ణ దర్శకత్వంలో కర్పగమ్ అనే సినిమా చేసింది.ఈ సినిమాలో ఈమె పేరుకు బదులుగా తండ్రి, తల్లి పేరు వచ్చేలా కెఆర్ విజయ అని పెట్టారు.

ఆ తర్వాత 1966లో ఎన్టీఆర్ సరసన శ్రీకృష్ణ పాండవీయం అనే సినిమాలో నటించింది.అప్పుడు తన వయసు కేవలం 17 ఏండ్లు మాత్రమే.

అదే సమయంలో ఈ సినిమాకు నిర్మాతగా చేసిన సుదర్శన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.అదికాస్తా ప్రేమగా మారింది.

నెమ్మదిగా పెళ్లి వరకు వెళ్లింది.

Telugu Kr Vijaya, Vijaya, Married, Sudharshan, Sr Ntr, Tollywood-Movie

ఇంట్లో వాళ్లకు చెప్పకుండా రహస్యంగా అతడిని పెళ్లి కూడా చేసుకుంది విజయ.అయితే ఈ విషయం ఎక్కడా బయకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.దానికి కారణం ఏంటంటే.

ఆమె పెళ్లి జరిగే సమయానికి తను మేజర్ కాదు.అందుకే ఈ విషయం బయటకు వస్తే సమస్యలు వస్తాయని తెలుసుకుని రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

తను ప్రెగ్నెంట్ అయ్యాక… తన భర్త ఓసారి విమానంలో తీసుకెళ్లాడు.

Telugu Kr Vijaya, Vijaya, Married, Sudharshan, Sr Ntr, Tollywood-Movie

అప్పట్లో తనకు సొంత విమానం కూడా ఉండేది.అప్పుడు ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటో కాస్త వైరల్ అయ్యింది.దీంతో కెఆర్ విజయకు పెళ్లి అయ్యింది అనే విషయం బయటకు వచ్చింది.

అప్పుడు తన మైనార్టీ కూడా తీరింది.ఈ ఫోటోలు అప్పట్లో పత్రికల్లో ప్రధాన వార్తలుగా ప్రచురితం అయ్యాయి.

ఆ తర్వాత కూడా భర్త సహకారంతో పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది విజయ.

#Kr Vijaya #Sr #Married #Vijaya #Sudharshan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube