కౌశల్ భార్య ఎదురుకున్న ఇబ్బందులు, డబ్బులిస్తే ఓట్లేస్తారు కానీ! బాబు గోగినేనిపై కౌశల్ కామెంట్స్.!     2018-10-04   10:54:46  IST  Sainath G

బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్ ముగిసింది. ఎన్నో అటంకాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొని విజేతగా కౌశల్ నిలిచారు. బిగ్‌బాస్‌లో ఉండగా బయట నుంచి కౌశల్ ఆర్మీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. దాంతో ఆయన సులభంగా పలు ఎలిమినేషన్ల గురించి బయటపడ్డారు. అయితే గతంలో కౌశల్ ఆర్మీ పై బాబు గోగినేని గారు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కౌశల్ ఆర్మీ పెయిడ్ అని అన్నారు.ఇప్పటికే కౌశల్ ఆర్మీ ఆ విషయమై బాబుపై కౌంటర్ పేల్చేశారు. తాజాగా కౌశల్ కూడా ఆ విషయమై స్పందించాడు.

బిగ్‌బాస్ ఇంట్లో ఒకసారి బాబు గోగినేనితో భారతీయ జెండాలోని అశోక చక్రంలో ఎన్ని పుల్లలు ఉంటాయని అడిగితే 26 అని సమాధానం చెప్పారు. అప్పుడే ఆయన ఏ రేంజ్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీ నాకు తెలిసింది. బాబు గోగినేని ఒక సర్వజ్ఞాని – ఆయనకు ప్రపంచ విషయాలు అన్ని తెలుస్తాయి కాని నాకు మాత్రం ఫ్యామిలీ – బిజినెస్ మరియు బిగ్ బాస్ హౌస్ లో గెలవడం మాత్రమే తెలుసు.

ఇతర విషయాల గురించి నాకు అసలు నాలెడ్జ్ లేనే లేదు. ముఖ్యంగా ఇలా డబ్బులు ఇచ్చి ఓట్లు పొందవచ్చు అనే ఒక కాన్సెప్ట్ నాకు తెలియదు. డబ్బులిచ్చి కొనుక్కుంటే వచ్చే పాపులారిటీ నాకు అస్సలు వద్దు. డబ్బులిచ్చి కొనుకున్న పాపులారిటీ ఎప్పటికి మనతో ఉండదు. కాని కష్టపడి సంపాదించుకున్న పాపులారిటీ మాత్రం ఎప్పటికి ఉంటుంది.

కౌశల్ సతీమణి నీలిమ కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కౌశల్ బిగ్ బాస్ లోకి వెళ్లిన తరువాత బయట తాను ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిపారు. హౌస్ లో ఆయనకు మొదటి రెండు వారాలు అంతా వ్యతిరేకంగా జరిగింది. చాలా భాదపడ్డా అని తెలిపారు. కొన్ని ట్రోలింగ్స్ కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని నీలిమ తెలిపారు.