వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా నుండి సాంగ్ ప్రోమో రిలీజ్..!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా.బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ తో రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ జత కట్టింది.సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ కొత్తగా లేదేంటి రిలీజైంది.వైష్ణవ్ తేజ్, కెతిక ఇద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ గా వస్తున్న ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.ఫుల్ సాంగ్ మే 6 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు.

 Kotthaga Ledenti Song Promo From Vaishnav Tej Ranga Ranga Vaibhavanga,vaishnav T-TeluguStop.com

తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాని ఆదిత్య వర్మగా రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు గిరీశయ్య.తెలుగులో అతను చేస్తున్న మొదటి సినిమా ఇదే.ఇక ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండంపొలం ఫ్లాప్ అవగా రాబోతున్న థర్డ్ మూవీ రంగ రంగ వైభవంగా.ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు మెగా హీరో.

రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ అందాలు సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉన్నాయని చెప్పొచ్చు . ఈ సినిమాను ముందు మే 27న రిలీజ్ చేయాలని అనుకున్నా లేటెస్ట్ గా జూలై 1న సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube