కొడుకు మోసం చేసి వదిలేసాడు... తండ్రి పెళ్లి చేసుకొని జీవితం ఇచ్చాడు  

కొడుకు ప్రేమించి మోసం చేసిన అమ్మాయిని పెళ్లి చెసుకున్న తండ్రి. .

Kottayam Native Marries Off His Son\'s Ex-girlfriend-

కేరళలోని జరిగిన ఓ సంఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.సోషల్ మీడియాలో అందరూ చర్చించుకునేలా చేసింది.అసలు విషయంలోకి వెళ్తే కొట్టాయంలో తిరున‌క్కార‌లో షాజీ అనే వ్యక్తి కుమారుడు ఉన్నాడు..

Kottayam Native Marries Off His Son\'s Ex-girlfriend--Kottayam Native Marries Off His Son's Ex-girlfriend-

ఆరేళ్ల క్రితం షాజీ కొడుకు ఒక అమ్మాయిని ఆమెని తీసుకొని ఇళ్లు వదిలి వెళ్లిపోయారు.అయితే పోలీసులు వాళ్లను పట్టుకుని కోర్టులో ప్రవేశపెట్టారు.ఇద్దరు మైనర్లు కావడంతో వారు మేజర్లు అయ్యేవరకు ఆగాలని అబ్బాయి తండ్రి వాళ్లకు నచ్చజెప్పాడు.

అయితే అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమె బాద్యతని కూడా తానే తీసుకున్నాడు.18 ఏళ్లు నిండిన వెంట‌నే ఇద్ద‌రికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు.

తాజాగా అమ్మాయికి 18 ఏళ్ళు నిండడంతో కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు.అయితే దానికి అబ్బాయి ఒప్పుకోలేదు.గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి వేరే అమ్మాయితో ప్రేమలో పడి ఈ అమ్మాయినొ పెళ్లి చేసుకోనని చెప్పేయడంతో అమ్మాయికి న్యాయం చేయాలని నిర్ణయం తీసుకున్న షాజీ ఆమె అంగీకారంతో తానే పెళ్లి చేసుకుని తన ఆస్తిని ఆమె పేరు మీద రాసేశాడు.

స్థానికంగా ఓ గుడిలో ఎంతో వైభవంగా అమ్మాయిని పెళ్లి చేసుకోగా, ఇప్పుడు ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.