కర్నూల్ కోట టీడీపీ కా ,వైసీపీ కా     2017-09-15   01:38:20  IST  Bhanu C

కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కర్నూల్ జిల్లా ఈయన సొంతజిల్లా..కర్నూల్ జిల్లా రాజకీయాలలో అత్యంత ప్రభావవంతమైన నేత. కోట్ల తండ్రి విజయ భాస్కర రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. అలాగే సూర్య ప్రకాష్ రెడ్డి కుడా కేంద్ర మంత్రిగా కూడా చేశారు. భార్య సుజాతమ్మ సైతం ప్రజాప్రతినిధిగా రాణించారు కర్నూల్ జిల్లా రాజకీయాలు వీరి కోటని దాటి బయటకి వెళ్ళేవి కావు. అంతగా వీరి ప్రాభల్యం జిల్లాలో ఉండేది. ముందు నుంచీ కాంగ్రేసు పార్టీ లో ఉన్న తమ కుటుంభం రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్ ని అంటిపెట్టుకుని వుంది.ఏపీ లో తీవ్ర వ్యతిరేకతని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడప్పుడే ఇక్కడ ప్రజలకి చేరువ కాలేదు,ఏపీ ప్రజలకి ఇంకా కాంగ్రెస్ మీద కోపం తగ్గలేదు అనేది నంద్యాల ఎన్నికల్తో తెలిసింది.

కర్నూల్ జిల్లా రాజకీయాలలో చక్రం తప్పిన కోట్ల కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం వలన ఆయన ప్రాభల్యం తగ్గిందనే చెప్పాలి.ఈ పరిణామాలు అన్నీ గమనిస్తూ ఉన్న కోట్ల వర్గం ఈ సమయంలో పార్టీ మారకపోతే రాజకీయ మనుగడే ఉండదు అనే సత్యాన్ని గుర్తించారు.

కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంభానికి ఇప్పటికి కర్నూల్ జిల్లలో చాలా పెద్ద క్యాడర్ ఉంది. ఇది ఇలా ఉంటే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టిడిపి లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది..అలాగే కోట్ల కుటుంబాన్ని తమ పార్టీలో కి తీసుకురావడానికి వైసీపి కూడా పావులు కదుపుతోంది. ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో వైసీపి తమ ప్రయత్నాలు చేస్తోంది. కానీ గతంలో వైఎస్, కోట్ల మధ్య ఉన్న విభేదాలు కారణంగా వైసీపికి వెళ్తార లేదా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే కోట్ల కుమారుడు ప్రకాష్ రెడ్డి లోకేష్ తో మంచి స్నేహం ఉంది. ఆ స్నేహం కోట్ల ని టీడీపి వైపు మళ్లేలా చేస్తుంది అని టాక్. ఈ సమీకరణాల నేపధ్యంలో కే.ఇ కృష్ణమూర్తి దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండటంతో ఇరువర్గాల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు అని తెలుస్తోంది. కోట్ల కుటుంబం కోరికలు కూడా చాలా కష్టతరంగా ఉన్నాయని తెలుస్తోంది. మరి ఎవరి వైపు కోట్ల మొగ్గు చూపుతారో వేచి చూడాలి.