రోడ్డు ప్రమాదానికి గురైన కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కాన్వాయ్! ముగ్గురు కార్యకర్తలు మృతి!  

మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ సమక్షంలో భారీ ఎత్తున వైసీపీలో చేరడానికి కార్యకర్తలతో భారీ కాన్వాయ్ లో కడప నుంచి బయలు దేరి వెళ్ళారు.

Kotla Harshavardhan Reddy Vehicles Road Accident In Orvakal-Kotla Orvakal

Kotla Harshavardhan Reddy Vehicles Road Accident In Orvakal

అయితే ఊహించని విధంగా కాన్వాయ్ ఓర్వకల్లు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కాన్వాయ్ లో వాహనాలు భారీగా దెబ్బతినగా కోట్ల హర్షవర్ధన్ తో కాన్వాయ్ లో వెళ్ళిన ముగ్గురు కార్యకర్తలు మృతి చెందారు. మరికొంత మంది గాయాలకి గురైనట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఎలా సంభవించింది అనే విషయాలు తెలియాల్సి వుంది.