సెయింట్ లూయిస్ లో ఘనంగా దీపావళి వేడుకలు

సెయింట్ లూయిస్: అక్టోబర్ 31: అమెరికా లో సెయింట్ లూయిస్ లో దీపావళి వేడుకల ఘనంగా జరిగాయి.లిండ్బర్గ్ లోని షామినాడ్ కాలేజి లో సెయింట్ లూయిస్ తెలుగు అసోషియేషన్ నిర్వహించిన ఈ వేడుకల్లో కోటి మ్యూజికల్ నైట్ తెలుగువారిని ఆనంద ఢోలికల్లో ముంచెత్తింది.

 Koti Musical Night For Tas Deepavali Celebrations-TeluguStop.com

దాదాపు రెండు వేలమందికి పైగా తెలుగువారు ఈ వేడుకలకు హాజరయ్యారు.ఈ సందర్భంగా టీఏఎస్ తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ దీపావళి పురస్కారాలను ప్రకటించింది.

తెలుగువారి మేలు కోసం అమెరికాలో అనేక విధాలుగా కృషి చేస్తున్న ప్రముఖులకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడిని దీపావళి పురస్కారంతో సత్కరించడం జరిగింది.

నాట్స్ అధ్యక్షుడిగా అమెరికాలో పలు సేవాకార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నందుకు శ్రీనివాస్ మంచికలపూడి ని ఈ పురస్కారం వరించింది.నాట్స్ మెడికల్ క్యాంపుల ద్వారా స్థానిక తెలుగువారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సుధీర్ అట్లూరి, డాక్టర్ రమా అట్లూరిని కూడా టీఏఎస్ దీపావళి పురస్కారాలతో సత్కరించింది.

Telugu Deepavali, Koti Musical, St Louis-

వీరితో పాటు స్థానిక టెంపుల్ ట్రస్ట్రీ మాజీ ఛైర్మన్ జీవీ నాయుడు, రాజ్యలక్ష్మి, ప్రస్తుత టెంపుల్ బోర్డ్ ఛైర్మన్ రజనీ కాంత్ గంగవరపు, పీజీఎన్ ఎఫ్ పౌండర్స్ శ్రీనివాస్ గుల్లపల్లి, చిన్నా ముచ్చెర్ల, కూచిపూడి ఛారిటబుల్ ట్రస్ట్ సుజాత ఇంజమూరి తదితరులకు దీపావళి పురస్కారాలు వరించాయి.టెంపుల్ డోనర్, కమ్యూనిటీ సర్వీస్ అవార్డును శ్రీథర్ కొత్తమాసుకు అందించడం జరిగింది.ఈ పురస్కారాలన్నీ టీఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, వైస్ ప్రెసిడెంట్ వెంకట్ గౌని, సెక్రటరీ రమేశ్ కొండ ముట్టి, కల్చరల్ సెక్రటరీ అర్చన ఉపమాక, ట్రెజరర్ రంగ సురేశ్, బోర్డ్ ఆఫ్ ఛైర్మన్ కుమార్ రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస భూమా, జగన్ వేజండ్ల, జితేంద్ర ఆలూరి, రాకేశ్ గజగౌని చేతుల మీదుగా అందించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లకు, ఈ వేడుకలకు స్పాన్సర్ గా వ్యవహారించిన వారికి సెయింట్ లూయిస్ తెలుగు అసోషియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube